Viral Video: ఈ వీడియో చూస్తే దడుచుకోవాల్సిందే.. తనను తానే తినేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్!
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:16 PM
ఈ భూమి మీద అత్యధిక మందిని భయపెట్టే జీవి పాము. అత్యంత భారీ, విషపూరిత సర్పాలను చూస్తే భయపడని వారు ఉండరు. పాములకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బయటకు వస్తున్నాయి. ఆకలేస్తే పాములు వాటిని అవే తినేస్తాయని చాలా మంది చెబుతుంటారు.
ఈ భూమి మీద అత్యధిక మందిని భయపెట్టే జీవి పాము (Snake). అత్యంత భారీ, విషపూరిత సర్పాలను చూస్తే భయపడని వారు ఉండరు. పాములకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బయటకు వస్తున్నాయి (Snake Video). ఆకలేస్తే పాములు వాటిని అవే తినేస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఆ మాటను ఎవరైనా నమ్మకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో పాము తనను తానే తినేస్తోంది. ఈ భయంకర వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము ఉంది. ఆ పాము తన తోకను తానే తినడం ప్రారంభించింది. చివరికి దాని శరీరంలోని దాదాపు సగం భాగాన్ని మింగేసింది. ఆ తర్వాతేం జరిగిందో మాత్రం వీడియోలో లేదు. ఆ వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు మూడు వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
``ఇది భయానకంగా ఉంది``, ``ఒక్కోసారి అధిక ఉష్ణోగ్రత కూడా పాములకు పాములకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది``, ``ఇది కేవలం ఒత్తిడి వల్లే జరుగుతుంది``, ``తోక పోయినా మళ్లీ తిరిగి వచ్చేస్తుంది``, ``చివరకు ఏం జరిగింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి