Share News

Viral video: షాకింగ్.. రీల్ మోజులో ప్రాణం పోగొట్టుకున్నాడు.. తల, మొండెం వేరవడంతో మృతి.. ఆగ్రాలో దారుణం..

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:58 AM

సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కదులుతున్న రైలుకు అడ్డంగా నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు, మరికొందరు ప్రాణాంతక బైక్ స్టంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్‌ కోసం ట్రై చేస్తుంటారు.

Viral video: షాకింగ్.. రీల్ మోజులో ప్రాణం పోగొట్టుకున్నాడు.. తల, మొండెం వేరవడంతో మృతి.. ఆగ్రాలో దారుణం..
Youth dies while making reel

ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్‌ (Reels)కు రోజురోజుకు విపరీతమైన క్రేజ్ పెరగిపోతోంది. ఈ రీల్స్ మోజులో ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కదులుతున్న రైలుకు అడ్డంగా నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు, మరికొందరు ప్రాణాంతక బైక్ స్టంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్‌ కోసం ట్రై చేస్తుంటారు. తాజాగా ఆగ్రాకు (Agra) చెందిన ఓ కుర్రాడు అలాగే ప్రయత్నించి అత్యంత దారుణంగా చనిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


Shyam Dwivedi అనే సీనియర్ జర్నలిస్ట్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రీల్ కోసం ప్రయత్నించిన 20 ఏళ్ల యువకుడి తల శరీరం నుంచి తెగిపడిపోయింది. ఆ వీడియోలో ఐదుగురు కుర్రాళ్లు ఉన్నారు. ఇద్దరు కుర్రాళ్లు వీడియో తీస్తుండగా ఓ కుర్రాడు రీల్ కోసం స్లో మోషన్‌లో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో భాగంగా నేలపై ఉన్న ఐరన్ నెట్‌ను లేపడానికి ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయి అక్కడి నుంచి కింద పడిపోయాడు. వాళ్లు అప్పటికి నాలుగో అంతస్థులో ఉన్నారు. అక్కడి నుంచి ఆ కుర్రాడు కిందకు పడిపోయాడు. ఆ కుర్రాడి మొండెం నుంచి తల వేరైపోయింది. అతడి స్నేహితులు అతడిని కాపాడేందుకు వెంటనే పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది.


యువకుడి మృతదేహం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు పడిపోయింది. అక్కడి నేలంతా రక్తం ప్రవహించింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఆ యువకులంతా దుకాణం తెరిచేందుకు వచ్చారు. అంతలోనే ఊహించిన విధంగా ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతి చెందిన ఆ యువకుడి పేరు ఆసిఫ్ (20) అని, అతని తండ్రి పేరు సలీం అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారు. ఆసిఫ్ ఓ నగల దుకాణంలో పని చేస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి మూడు పాములను ఎలా బయటకు వదులుతోందో చూడండి.. !

Viral Video: వావ్.. ఆ సింహం స్వాగ్‌కు ఫిదా కావాల్సిందే.. బానెట్ మీద నిల్చుని ఎలా ప్రయాణించిందో చూడండి..


Funny Answer Sheet: హిస్టరీ పరీక్షలో ఆ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్.. టీచర్ ఏం చేశారంటే..


Picture Puzzle: మీ బ్రెయిన్ స్పీడ్ ఎంత?.. ఈ పార్టీలో దొంగను 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 20 , 2024 | 10:58 AM