Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ
ABN , Publish Date - Sep 27 , 2024 | 01:21 PM
యూట్యూబర్ ఖుష్బూ పాఠక్ తనకు 24 మంది పిల్లలు జన్మించారని ఇటీవల వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నిజం కాదట. ఈ విషయాన్ని ఆమె భర్త వివరించారు. తమకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు.
ఫేమస్ అయ్యేందుకు కొందరు అబద్దాలు చెబుతుంటారు. ఎలాగోలా తాము ఫేమ్ అవ్వాలని అనుకుంటారు. సోషల్ మీడియాను అసరాగా చేసుకొని పోస్టులు చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతారు ఖుష్బు పాఠక్. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఓ పెద్ద అబద్దం ఆడేసింది. రావాల్సినంతా పేరు వచ్చిన తర్వాత.. అదేం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇదీ విషయం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచ్చిదానంద్ పాఠక్, ఖుష్బు పాఠక్ (Khushbu Pathak) దంపతులు. యూట్యూబ్‌లో ఖుష్బూ పాఠక్ వీడియోలు చేస్తుంటారు. షార్ట్స్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఖుష్బూ వార్త హమ్ దో హమారే దో డజన్ అని సంచలనం రేపాడు. ‘నా భార్యకు ఓకే కాన్పులో 24 మంది జన్మనిచ్చింది. వీరిలో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగ పిల్లలు. అంతమంది పిల్లలు ఇచ్చిన నా భార్య భాగ్యలక్ష్మీ అని. దేవుడు ఇచ్చాడు, తాము తీసుకున్నాం అని’ ఆ వీడియోకు ట్యాగ్ చేశాడు.
బాంబ్ పేల్చిన భర్త
ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అంతా ఆశ్చర్య పోయారు. ఖుష్బుపై ప్రశంసలు కురిపించారు. రెండు, మూడు రోజుల నుంచి ఖుష్బూ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇంతలో ఖుష్బూ భర్త బాంబ్ పేల్చాడు. అదేం లేదని తమకు ఇద్దరు పిల్లలే ఉన్నారని స్పష్టం చేశారు. అన్మొల్, ఆరాధ్య మాత్రమే ఉన్నారని.. మిగతా 22 మొక్కలను ఇటీవలే నాటామని వివరించారు. మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అలా వీడియో పోస్ట్ చేశామని పేర్కొన్నారు. ఖుష్బూ వీడియో పోస్ట్ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించామని జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు
KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.