Share News

Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:08 AM

డబ్బంటే ఎవరికి చేదు. అందులోనూ ఫ్రీగా వస్తోందంటే చాలా మంది ఎగబడతారు. జనాల్లో ఈ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ యూట్యూబర్ తన వీడియో కోసం ఓ ప్లాన్ వేశాడు. అతడు అనుకున్నట్టుగానే జనాలు ఎగబడడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!
Man throwing bundles of money in the air

డబ్బంటే (Money) ఎవరికి చేదు. అందులోనూ ఫ్రీగా వస్తోందంటే చాలా మంది ఎగబడతారు. జనాల్లో ఈ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ యూట్యూబర్ (Youtuber) తన వీడియో కోసం ఓ ప్లాన్ వేశాడు. అతడు అనుకున్నట్టుగానే జనాలు ఎగబడడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌ (Hyderabad)లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యూట్యూబర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యూట్యూబర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో బిజీ రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నాడు. వేరే వ్యక్తి బైక్ నడుపుతుండగా ఆ యూట్యూబర్ బైక్ మీద నుంచి పైకి లేచి చేతిలో ఉన్న నోట్ల కట్టను గాల్లోకి వెదజల్లాడు. దీంతో ఆ డబ్బు అంతా కింద పడింది. ఆ డబ్బును ఏరుకోవడానికి అక్కడ ఉన్న జనాలు పోరాటం చేశారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ యూట్యూబర్ చేసిన పని వల్ల ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. నోట్లు ఏరుకోవడానికి జనాలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇలాంటి అనాలోచిత పనుల వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు``, ``ఎంతటి గర్వం``, ``ఆ కుర్రాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ సింపుల్ పజిల్‌ను 10 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 08:08 AM