Zomato CEO: కామెంట్ చూసి ముచ్చటపడ్డ జొమాటో సీఈవో.. నెటిజన్‌కు బంపర్ ఆఫర్
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:33 PM
సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అద్భుతాలు చేయొచ్చని మరోసారి రుజువైంది. తన తెలివితేటలతో ఓ నెటిజన్ ఏకంగా జొమాటో కంట్లో పడ్డాడు..
ముంబై: ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ను తెగ ఇంప్రెస్ చేసేసింది. దీంతో ఆ నెటిజన్ కు రిప్లై ఇస్తూ బంఫర్ ఇచ్చేశాడు. వీరిద్దరి చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల జొమాటో తన సేవలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే తమ యాప్ లో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా.. క్యాన్సల్ చేసిన ఫుడ్ ను తక్కువ ధరకు అవసరమున్న మరో కస్టమర్ కు అందిస్తారు. అలా కొనుక్కోవడానిక ఓ పాప్ అప్ బాక్స్ ను యాప్ లో చూపుతుంది. దీని ద్వారా ఫుడ్ వేస్టేజ్ ను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జొమాటో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ను ఆదివారం ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ఈ పోస్టుకు సమాధానంగా బాను అనే ఓ నెటిజన్ కొన్ని సూచనలు చేస్తూ కామెంట్ పెట్టాడు.
1. క్యాష్ ఆన్ డెలివరీకి దీనిని వర్తింపజేయకండి.
2. డెలివరీ పాయింట్‌కి 500 మీటర్ల దూరం ఉన్నప్పుడు డెలివరీ క్యాన్సిల్ ని అనుమతించకండి.
3. ఇద్దరు స్నేహితులు కలిసి ఒకరు ఆర్డర్ క్యాన్సిల్ చేసి మరో వ్యక్తి అదే భోజనాన్ని తక్కువ ధరకు తీసుకుని ఫ్రాడ్ చేసే చాన్స్ ఉంది.
4. నెలలో ఒక కస్టమర్ రెండు సార్లు మాత్రమే క్యాన్సిల్ చేసే విధంగా లిమిట్ పెట్టండి.
అంటూ పాయింట్ల రూపంలో ఈ ఫీచర్ ను మిస్ యూజ్ కాకుండా చూడాలని తెలిపాడు. అతడి కామెంట్ చూసి గోయల్ తెగ మురిసిపోయాడు. నువ్వెవరో తెలియదు.. నువ్వు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాం. నీ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మా సంస్థతో కలిసి పనిచేయాలని కోరుతున్నాం అంటూ ఏకంగా జాబ్ ఆఫర్ ఇచ్చేశాడు. దానికి సమాధానంగా ఆ వ్యక్తి స్పందించాడు. గోయల్ కు థ్యాంక్స్ చెప్తూ తన వివరాలు తెలియజేశాడు. దీంతో ఆ నెటిజన్ ను అంతా అభినందనలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు.
Viral Video: ఇది పిచ్చికి పరాకాష్ట.. వ్యూస్ కోసం అన్ని హద్దులనూ దాటేశాడు.. బ్రెడ్ ఎలా తింటున్నాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
IQ Test: ఈ నలుగురిలో ప్రమాదంలో ఉన్నది ఎవరు?.. 5 సెకెన్లలో గుర్తించి హెచ్చరించండి..