Share News

Zomato: అర్ధరాత్రి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ చేసిన ఆ రిక్వెస్ట్ కి ఆమె ఏం చేసిందంటే..

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:09 PM

ఆర్జరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసినందుకు ఆ డెలివరీ బాయ్ చేసిన రిక్వెస్ట్ కు.. ఓ మహిళ చేసిన పని ఇదీ..

Zomato: అర్ధరాత్రి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ చేసిన ఆ రిక్వెస్ట్ కి ఆమె ఏం చేసిందంటే..

నగరాలలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ చాలా విస్తృతమైపోయింది. ఎనీ టైమ్.. ఎనీ ప్లేస్.. ఎనీ సెంటర్ డెలివరీ షురూ.. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరూ తమ ఫుడ్ ఎంత తొందరగా వస్తే అంత బాగుండు అనుకుంటారు. ఈ విషయంలో డెలివరీ బాయ్ ల శ్రమ చాలా ఉంటుంది. కానీ వారి శ్రమకు తగిన గుర్తింపు మాత్రం చాలావరకు దక్కదనే చెప్పాలి. ఓ మహిళ అర్దరాత్రి సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ ఇవ్వడానికి ముందు డెలివరీ బాయ్ చేసిన రిక్వెస్ట్ కు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!


జొమాటోలో ఓ మహిళ అర్ధరాత్రి సమయంలో ఫుడ్ ఆర్జర్ చేసింది. జొమాటో డెలివరీ బాయ్ ఆ సమయంలో కూడా ఆమెకు ఫుడ్ డెలివరీ చేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. అతను డెలివరీ ఇవ్వడానకి ముందు ఆ మహిళకు మెసేజ్ చేశాడు. మెసేజ్ లో ఫుడ్ డెలివరీ చేసిన తరువాత నాకు టిప్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి ఫుడ్ డెలివరీ చేసిన తరువాత టిప్ ఇవ్వండి, ఇంత రాత్రిపూట డెలివరీ చేసినందుకు అయినా టిప్ ఇవ్వండి అంటూ అతను రిక్వెస్ట్ చేశాడు. అతను ఫుడ్ డెలివరీ చేసిన తరువాత ఆమె అతనికి టిప్ ఇచ్చిందా లేదా అనే విషయం తెలియదు కానీ ఆమె మాత్రం అతను రిక్వెస్ట్ గా పెట్టిన మెసేజ్ లను స్కీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది చాలా వింతగా ఉంది భాయ్ అంటూ తన పోస్ట్ కు క్యాప్షన్ మెన్షన్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం మహిళ మీద విరుచుకు పడుతున్నారు. డెలివరీ పార్ట్నర్ అనుమతి లేకుండా ఇాలా స్క్రీన్ షాట్ పెట్టడం సరైనది కాదని ఆమెను విమర్శిస్తున్నారు. డెలివరీ బాయ్ లకు టిప్ ఇవ్వడం వారిని ప్రసంచింనట్టే కాదు.. వారు చేస్తున్న కష్టానికి అదొక గుర్తింపు కూడా.. అంటున్నారు.

ఇది కూడా చదవండి: Late Night Sleep: ప్రతిరోజూ అర్దరాత్రి తరువాత నిద్రపోయే అలవాటుందా? అయితే మీకూ ఈ సమస్యలు రావడం పక్కా..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 06 , 2024 | 01:09 PM