T20 World Cup 2024: ఆఫ్ఘాన్ జట్టుకు సూపర్8లో ఛాన్స్.. న్యూజిలాండ్, ఉగాండా ఔట్
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:24 PM
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ క్రమంలో పపువా న్యూ గినియా జట్టు 19.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వచ్చిన ఆప్ఘానిస్తాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ విజయంతో న్యూజిలాండ్(New Zealand) జట్టు ఆశలు గల్లంతయ్యాయి(eliminated). ఈ క్రమంలో గ్రూప్-సీ నుంచి సూపర్-8కి చేరిన రెండో జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. అదే సమయంలో ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ ప్రయాణం ముగిసిందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఉగాండా(Uganda), పపువా న్యూ గినియా(Papua New Guinea) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే ఈ గ్రూపులో అగ్రస్థానం ఎవరిదో తెలియాలంటే వెస్టిండీస్-ఆప్ఘానిస్తాన్ మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్
న్యూజిలాండ్ (New Zealand) జట్టు ఈసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇంతకుముందు 1987 ODI ప్రపంచకప్‌లో ఈ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అదే సమయంలో 1983 ODI ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టు గ్రూప్ దశ లేదా మొదటి రౌండ్‌ను దాటలేకపోయింది. టీ20 ప్రపంచకప్‌లో ప్రతిసారీ రెండో రౌండ్‌కు చేరుకోగలిగింది.
ఆ క్రమంలో 2009, 2010, 2012 T20 ప్రపంచ కప్‌లలో కివీస్ జట్టు సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించగా, 2014లో న్యూజిలాండ్ జట్టు ఆటోమేటిక్ సూపర్-10 రౌండ్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ జట్టు 2007, 2016, 2022 టీ20 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కు చేరుకోవడంలో విజయం సాధించింది. కాగా 2021లో కివీ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఇది కూడా చదవండి:
Kuwait Fire: కువైట్ నుంచి 45 మంది మృతదేహాలతో కేరళ చేరుకున్న IAF విమానం..రూ.7 లక్షల సాయం
Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!
Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ
Read Latest Sports News and Telugu News