India vs England: తొలి మ్యాచులోనే అదరగొట్టిన ఆకాష్ దీప్.. లంచ్ బ్రేక్ వరకు 5 వికెట్లు
ABN , Publish Date - Feb 23 , 2024 | 11:59 AM
రాంచీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఆకాశ్ దీప్(Akash Deep) భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేసి ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను ఔట్ చేసి వావ్ అనిపించుకున్నాడు.
రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్, ఇంగ్లండ్(India vs England) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ టెస్టులో భారత్ తరఫున తొలిసారిగా అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్(Akash Deep) తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేసి ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు డబుల్ షాక్ ఇచ్చాడు.
మరోవైపు ఆకాశ్ దీప్ తర్వాత అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ తీసి ఇంగ్లండ్ జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపారు. టీమ్ ఇండియా(team india) ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ విభాగాలు రెండూ చాలా తెలివిగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బేస్ బాల్ వ్యూహాన్ని అణిచివేసేందుకు కృషి చేశాయి. ఈ నేపథ్యంలో లంచ్ వరకు ఇంగ్లండ్ జట్టు స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 112గా ఉంది.
అయితే ఆకాశ్ దీప్ తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇంగ్లండ్(England) బేస్ బాల్ వ్యూహాన్ని చిత్తు చేశాడు. రాంచీ పిచ్ కారణంగా ఈ మైదానంలో స్పిన్ బౌలింగ్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే సిరీస్ టీమిండియా వశం కావడం ఖాయమని క్రీడాభిమానులు భావిస్తున్నారు. దీంతోపాటు ఆకాశ్ బౌలింగ్ తీరుపై కూడా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Markets: బుల్ జోరు..స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు