Share News

Chess Championship : నాలుగో స్థానంలో హారిక

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:01 AM

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పను తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి విజయంతో ప్రారంభించాడు. భారత కాలమా నం ప్రకారం గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ మెగా టోర్నీలో ఓపెన్‌ విభాగంలో తొలి ఐదు రౌండ్లకుగాను నాలుగింటిలో అర్జున్‌ గెలిచాడు.

 Chess Championship : నాలుగో స్థానంలో హారిక

  • 12లో అర్జున్‌.. 38లో హంపి

  • జూప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌

న్యూయార్క్‌: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పను తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి విజయంతో ప్రారంభించాడు. భారత కాలమా నం ప్రకారం గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ మెగా టోర్నీలో ఓపెన్‌ విభాగంలో తొలి ఐదు రౌండ్లకుగాను నాలుగింటిలో అర్జున్‌ గెలిచాడు. మూడో రౌండ్‌ ఓటమిని మినహాయిస్తే మిగతా రౌండ్లన్నింటిలో ప్రత్యర్థులను ఓడించాడు. దీంతో ఐదురౌండ్లు ముగిసేసరికి అర్జున్‌ 4 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత ఆటగాడు రౌనక్‌ సధ్వాని కూడా 4 పాయింట్లే సాధించినా.. తన ఖాతాలో ఓటమే లేకపోవడంతో ఐదో స్థానంలో నిలిచాడు. హర్ష భరత్‌కోటి 2.5 పాయింట్లతో 108వ స్థానంలో, ప్రజ్ఞానంద 3 పాయింట్లతో 56వ స్థానంలో ఉన్నారు. మహిళల ర్యాపిడ్‌ విభాగంలో తొలిరోజు నాలుగు రౌండ్లు జరిగాయి. 3 విజయాలు, ఓ డ్రా నమోదుచేసిన హారిక 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. హంపి 2.5 పాయింట్లతో 38వ, సాహితి వర్షిణి 2 పాయింట్లతో 57వ, ప్రియాంక 2 పాయింట్లతో 61వ స్థానాల్లో ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 03:11 AM