Share News

Paris Olympics 2024: నీరజ్ చోప్రా తల్లి నాకూ తల్లిలాంటిదే.. పాకిస్తాన్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్ కామెంట్స్!

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:35 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ సాధించాడు. స్వర్ణం సాధిస్తాడని ఆశలు పెట్టుకుంటే రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదే పోటీలో పాకిస్తాన్ జావెలిన్ థ్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ మెరుగైన ప్రతిభ కనబరిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

Paris Olympics 2024: నీరజ్ చోప్రా తల్లి నాకూ తల్లిలాంటిదే.. పాకిస్తాన్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్ కామెంట్స్!
Neeraj Chopra, Arshad Nadeem

పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ థ్రో (javelin throw) ప్లేయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) సిల్వర్ మెడల్‌ సాధించాడు. స్వర్ణం సాధిస్తాడని ఆశలు పెట్టుకుంటే రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదే పోటీలో పాకిస్తాన్ జావెలిన్ థ్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) మెరుగైన ప్రతిభ కనబరిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రాను రెండో స్థానానికి పరిమితం చేశాడు. ఒలింపిక్ ప్రదర్శనపై నీరజ్ చోప్రా తల్లి (Neeraj Chopra's mother) స్పందన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రజతం సాధించిన కొడుకును ప్రశంసిస్తూనే, అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని వ్యాఖ్యానించారు. ఆమె కామెంట్‌పై విభిన్న రియాక్షన్లు వస్తున్నాయి.


నీరజ్ చోప్రా తల్లి రియాక్షన్‌పై తాజాగా అర్షద్ నదీమ్ స్పందించాడు. తాజాగా పాకిస్తాన్ చేరుకున్న అర్షద్ మీడియాతో మాట్లాడాడు. ``తల్లి ఎవరికైనా తల్లే. ఆమె అందరి గురించి ప్రార్థిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి ధన్యవాదాలు. ఆమె నాకు కూడా తల్లిలాంటిదే. ప్రపంచ వేదికపై జావెలిన్ థ్రో విభాగంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు ఇద్దరం దక్షిణాసియాకు చెందిన వాళ్లమే`` అని నదీమ్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్‌లో అరుదైన ఘనత సాధించిన నదీమ్‌కు పాకిస్తాన్‌లో ఘన స్వాగతం లభించింది.


ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించలేకపోవడంపై నీరజ్ చోప్రా క్షమాపణలు చెప్పాడు. ``ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. టోక్యోలో మాదిరిగా పారిస్‌లో ఒలింపిక్ పోడియంపై మన జాతీయ గీతం వినిపించలేదు. పారిస్‌లో ఆశించిన పతకం సాధించలేకపోయా`` అంటూ నీరజ్ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: వారానికే రంగు కోల్పోతున్న ఒలింపిక్ మెడల్స్.. సంచలన విషయం బయటపెట్టిన అథ్లెట్!


Paris Olympics 2024: నేటితో ఒలింపిక్స్ వేడుకలు ముగింపు.. నెక్స్ట్ ఎక్కడంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 11 , 2024 | 08:35 PM