Home » Neeraj Chopra
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొద్ది తేడాతో డైమండ్ లీగ్ టైటిల్‌ను కోల్పోయాడు. ఈ సీజన్ ఫైనల్లో 87.86 మీటర్ల త్రోతో వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచాడు. ప్రత్యర్థి అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
వరుసగా రెండు ఒలింపిక్స్ల్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్. వీరిద్దరికీ ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది.
ఎట్టకేలకు ఒలింపిక్స్ ముగిశాయి. సీజన్లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. గాయం వల్ల స్వర్ణ పతకం జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నీరజ్ ధరించిన వాచ్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ గడియారం సాదా సీదాది కాదు. వాచ్ ధర రూ.లక్షల్లో ఉండటంతో ఒక్కటే డిస్కషన్.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. స్వర్ణం సాధిస్తాడని ఆశలు పెట్టుకుంటే రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదే పోటీలో పాకిస్తాన్ జావెలిన్ థ్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ మెరుగైన ప్రతిభ కనబరిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
ఆటలో గెలుపు ఓటమలు సహజం.. ఓడిపోతే మాత్రం జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది తన బిడ్డ రెండో ప్లేస్‌లో నిలిస్తే చాలా కష్టం. డైజెస్ట్ చేసుకోలేరు. నీరజ్ చోప్రా తల్లి అందుకు మినహాయింపు. భారత్ అంటే పాకిస్థాన్ భగ్గున లేస్తోంది. క్రీడల విషయంలో అంతే. క్రికెట్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఒలింపిక్స్‌లో జావొలిన్ త్రో విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అతనిపై నీరజ్ తల్లి సరోజ్ దేవి ఏ మాత్రం కోపం ప్రదర్శించలేదు.
Neeraj Chopra - Paris Olympics 2024: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం ఒక్క త్రో తో సంచలనం సృష్టించాడు. నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. మంగళవారం జరిగిన సింగిల్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.
ఏం గెలుస్తుందిలే.. అని తేలిగ్గా తీసుకొన్న రెజ్లర్ వినేశ్ ఫొగట్ పెను సంచలనం సృష్టించింది. ఓటమి ఎరుగని డిఫెండింగ్ చాంప్ యుయి సుసాకికి ఓటమి రుచిచూపింది. క్వార్టర్స్‌లో ఓక్సానా లివాచ్ (ఉక్రెయిన్)పై నెగ్గిన ఫొగట్.. సెమీస్‌లో యుస్నేలిస్ గుజ్మన్ను ఓడించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పతకం తెచ్చిపెట్టడం ఖాయమని అంచనా వేసిన పలువురు ఆటగాళ్లు సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. ఇప్పటివరకు కేవలం మూడంటే మూడు కాంస్యాలను మాత్రమే గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నా..అథ్లెటిక్స్‌కు ఉండే క్రేజే వేరు. గతంలో ఈ విభాగానికి సంబంధించి భారత్‌కు పెద్దగా చెప్పుకోవాల్సింది ఉండేది కాదు. కానీ టోక్యో విశ్వ క్రీడల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చారిత్రక స్వర్ణ పతకం కొల్లగొట్టడంతో ప్రపంచ అథ్లెటిక్స్ దృష్టి ఒక్కసారిగా భారత్‌పై నిలిచింది.