Share News

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:38 PM

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడవసారి ఈ పదవిలో కొనసాగేందుకు ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఆసక్తి చూపించలేదు. ఈ మేరకు ఆగస్టు 20న ప్రకటన కూడా చేశారు. నవంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఛైర్మన్ పదవికి ఏకైక నామినీ అయిన జై షా ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికయ్యారు. ప్రపంచ దేశాల్లో క్రికెట్ పరిధిని పెంచడానికి, జనాల్లో ఆదరణ పెంచడానికి నిబద్ధతగా పనిచేస్తానని ఆయన చెప్పారు.


అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌ పదవికి నామినేట్ అవడం హూందాగా భావిస్తున్నానని జై షా వ్యాఖ్యానించారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకుగానూ ఐసీసీ బృందం, సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నిబద్ధతతో ఉన్నాని తెలిపారు. అన్ని ఫార్మాట్‌లను సమతుల్యం చేయాల్సిన కీలకమైన దశలో ఉన్నామని జై షా అన్నారు. అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ప్రోత్సాహించడం, ప్రపంచ మార్కెట్లకు ఐసీసీ మెగా ఈవెంట్లను పరిచయం చేయడం ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. మునుపెన్నడూ లేనంత స్థాయిలో క్రికెట్‌కు జనాధరణ కల్పించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Updated Date - Aug 27 , 2024 | 09:01 PM