Virat Kohli: బెంగళూరులోని విరాట్ కోహ్లీ పబ్‌పై పోలీసుల రెయిడ్.. కేసు నమోదు.. కారణం ఏంటంటే..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:54 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ``వన్8 కమ్యూన్`` పేరుతో పబ్ కమ్ రెస్టారెంట్ చైన్ ఉంది. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచుతున్నారనే కారణంతో ఆ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ``వన్8 కమ్యూన్`` పేరుతో పబ్ కమ్ రెస్టారెంట్ చైన్ (One8 Commune pub) ఉంది. బెంగళూరు (Bengaluru)లోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు (Bengaluru police) రెయిడ్ చేశారు. అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచుతున్నారనే కారణంతో ఆ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఒక్క పబ్‌పైనే కాకుండా ఎమ్‌జీ రోడ్డులో ఉన్న పబ్‌లు, దుకాణ సముదాయాలపై కేసులు నమోదు చేశారు. జూన్ 6వ తేదీన రాత్రి, కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు (Raid on One8 Commune pub).
స్థానిక నిబంధనల ప్రకారం అర్ధరాత్రి 1:00 గంటల వరకు మాత్రమే పబ్‌లను తెరిచి ఉంచాలి. అయితే వన్8 కమ్యూన్ పబ్ మాత్రం 1:30 గంటల వరకు తెరిచే ఉంటోంది. చిన్నస్వామి స్టేడియంకు దగ్గర్లో ఉన్న పబ్ నుంచి అర్ధరాత్రి సమయంలో చాలా పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెయిడ్ చేసి కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాఫ్తు జరుగుతోందని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
విరాట్ కోహ్లీ ``వన్8 కమ్యూన్`` పేరుతో పబ్‌లను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో ఏర్పాటు చేశాడు. గతేడాది డిసెంబర్‌లోనే బెంగళూరు పబ్‌ను ప్రారంభించాడు. రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్థులో ఈ పబ్ ఏర్పాటైంది. కాగా, కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌లో కోహ్లీ సేద తీరుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!
Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..