Share News

Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌ అప్పీల్‌పై తీర్పు వాయిదా..

ABN , Publish Date - Aug 13 , 2024 | 09:39 PM

భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)‌ వాయిదా వేసింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్‌లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.

Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌ అప్పీల్‌పై తీర్పు వాయిదా..
Vinesh Phogat

భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)‌ వాయిదా వేసింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్‌లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.


బరువు పెరిగిందని..

ఒలింపిక్స్‌లో భారత రెజర్ల వినేశ్ ఫోగట్ ఫైనల్ చేరారు. ఫైనల్ జరిగే కొన్ని గంటల ముందు ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. బరువు పెరిగినందుకు చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. దాంతో యావత్ భారతదేశం నిరాశకు గురయ్యింది. తనకు జరిగిన అన్యాయాన్ని వినేశ్ ఫోగట్ కాస్‌లో అప్పీల్ చేశారు. ఫోగట్ తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. ఫోగట్, ఒలింపిక్ కమిటీ తరపున కాస్ న్యాయస్థానం వాదనలు విన్నది. మంగళవారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వెలువరించాల్సి ఉండేది. తీర్పును మరోసారి వాయిదా వేసింది. 16వ తేదీన ప్రకటిస్తామని స్పష్టం చేసింది. దాంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. 16వ తేదీ వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. తీర్పు కోసం వినేశ్ ఫోగట్ ప్యారిస్‌లోనే ఉన్నారు.


తీర్పు కూడా వాయిదా..

‘కేసులో కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తోంది. తీర్పు కూడా వాయిదా పడిందంటే తీర్పు అనుకూలంగా ఉండొచ్చు. ప్యానెల్‌లో మహిళ న్యాయమూర్తి ఉన్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉండి ఉంటారు. నిజానికి ఈ కేసుల్లో విజయ అవకాశాలు చాలా తక్కువ. ఫోగట్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని ఆశిస్తున్నాం. అద్భుతం జరుగుతుందని అందరాం ఆశిద్దాం అని’ న్యాయవాది విదుష్పత్ సింఘానియా అభిప్రాయ పడ్డారు.

Updated Date - Aug 13 , 2024 | 10:05 PM