Share News

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Dec 24 , 2024 | 07:21 PM

వ‌చ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్ కోరినట్టుగానే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగబోతోంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగబోతున్నాయి.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..
Champions Trophy 2025 schedule revealed

వ‌చ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025 ) షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్ కోరినట్టుగానే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగబోతోంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగబోతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాదు.. 2025 నుంచి 2027 మధ్య జరగబోయే అన్ని ఐసీసీ ఈవెంట్‌లలో భారత్, పాక్ మధ్య జ‌రిగే మ్యాచుల‌న్నీ తటస్థ వేదికలపైనే జరుగుతాయి. (Champions Trophy 2025 schedule)


ఐసీసీ మహిళల వ‌న్డే ప్రపంచ కప్ 2025 (భారత్‌ ఆతిథ్యం), ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం) కోసం కూడా పాక్ టీమ్ భారత్‌ రాదు. ఆ మ్యాచ్‌లు తటస్థ వేదికల పైనే జరుగుతాయి. ఇక, 2028లో జరిగే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌ కప్ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఆ మ్యాచ్‌లు కూడా త‌ట‌స్థ వేదిక‌ల‌లోనే జ‌రగ‌నున్నాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-పాక్ (India vs Pakistan) మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరగబోతోంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి.


ఛాంపియన్స్ ట్రోఫీ-20254 షెడ్యూల్‌ ఇదే..

ఫిబ్రవరి 19 – పాకిస్తాన్ v న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 20 – ఇండియా v బంగ్లాదేశ్, దుబాయ్

ఫిబ్రవరి 21 – అఫ్గాన్ v దక్షిణాఫ్రికా, కరాచీ

ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా v ఇంగ్లండ్, లాహోర్

ఫిబ్రవరి 23 – ఇండియా v పాకిస్తాన్, దుబాయ్

ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 25 – ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా, రావల్పిండి

ఫిబ్రవరి 26 – అఫ్గాన్ v ఇంగ్లండ్, లాహోర్

ఫిబ్రవరి 27 – పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి

ఫిబ్రవరి 28 – అఫ్గాన్ v ఆస్ట్రేలియా, లాహోర్

మార్చ్ 1 – దక్షిణాఫ్రికా v ఇంగ్లండ్, కరాచీ

మార్చ్ 2 – ఇండియా v న్యూజిలాండ్, దుబాయ్

మార్చ్ 4 – సెమీ ఫైనల్ 1, దుబాయ్

మార్చ్ 5 – సెమీ ఫైనల్ 2, లాహోర్

మార్చ్ 9 – ఫైనల్ - లాహోర్ (ఒకవేళ భారత్ ఫైనల్‌కు వెళ్తే దుబాయ్)

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2024 | 07:21 PM