Share News

Virat Kohli: కోహ్లీ కుమారుడి ఫొటోలు లీక్.. ఎవరి పోలికో తెలుసా..

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:57 PM

ఆసిస్ తో మ్యాచ్ సందర్భంగా తొలిసారి కోహ్లీ కుమారుడి ఫొటోలు లీకయ్యాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారడంతో కోహ్లీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

Virat Kohli: కోహ్లీ కుమారుడి ఫొటోలు లీక్.. ఎవరి పోలికో తెలుసా..
Virat Kohli

పెర్త్: ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మల కుమారుడు అకాయ్ ఫొటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. విరుష్క జోడీ ఇప్పటివరకు తమ కుమారుడి ఫొటోలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరామెన్లు అనుష్కతో పాటు అకాయ్ పై ఫోకస్ పెట్టారు. దీంతో అకాయ్ ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. క్షణాల్లో అవి కాస్తా వైరల్ కావడంతో కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


తమ అభిమాన క్రికెటర్ వారసుడిని చూసి అచ్చం తండ్రిపోలికే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో వర్గం నెటిజన్లు మాత్రం కెమెరామెన్లపై మండిపడుతున్నారు. ఇలా క్రికెటర్లు, వారి కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా వారిని ఇలా కెమెరాల్లో బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదొక్కటే కాదు గతంలో విరుష్క జంట కుమార్తె వామికను సైతం ఇలాగే క్యాప్చర్ చేసి లీక్ చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.


వామిక పుట్టిన దాదాపు మూడేళ్లకు అనుష్క శర్మ అకాయ్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న వీరికి మగ బిడ్డ జన్మించగా అతడికి అకాయ్ అని పేరు పెట్టుకున్నారు ఈ క్యూట్ కపుల్. అయితే, తమ పిల్లల గోప్యతను కాపాడుకోవడానికి ఈ జంట ఎంత కష్టపడినప్పటికీ మరోసారి అకాయ్ ఫొటోలు బయటకు రావడం గమనార్హం.

Updated Date - Nov 24 , 2024 | 03:57 PM