Share News

T20 World Cup 2024: ‘నసావు పిచ్’పై ఐసీసీ కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:06 AM

టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు వేదికైన ‘నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్‌’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

T20 World Cup 2024: ‘నసావు పిచ్’పై ఐసీసీ కీలక ప్రకటన

టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు వేదికైన ‘నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్‌’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేదికపై స్వల్ప స్కోర్లు నమోదవుతుండడం.. పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం, సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి ఎక్కువ సానుకూలత ఉండడంపై క్రికెట్ నిపుణుల నుంచి ఫ్యాన్స్ వరకు తీవ్రంగా మండిపడుతున్నారు. హడావుడిగా నిర్మించి ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో నసావు పిచ్‌పై ఐసీసీ స్పందించింది.


ఈ వేదికను సరైన పిచ్‌గా మార్చేందుకు ‘ప్రపంచ స్థాయి గ్రౌండ్ బృందాలు’ కృషి చేస్తున్నాయని ఐసీసీ వెల్లడించింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఉపయోగించిన పిచ్‌లపై రెగ్యులర్‌గా ఆడలేదని ప్రస్తావించింది. భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ ముగిసిన నాటి నుంచి ప్రపంచ స్థాయి గ్రౌండ్స్ బృందాలు పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయని, మిగిలిన మ్యాచ్‌లకు సాధ్యమైనంత బెస్ట్ పిచ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని వివరణ ఇచ్చింది. జూన్ 5న భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ఐసీసీ ఈ ప్రకటన చేసింది.


కాగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా తలపడ్డాయి. ఇక జూన్ 8న దక్షిణాఫ్రికా వర్సస్ నెదర్లాండ్స్‌, జూన్ 7న ఐర్లాండ్‌ వర్సెస్ కెనడా, ఇక జూన్ 9న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌కు కూడా ఇదే మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జూన్ 10న దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, జూన్ 11న పాకిస్తాన్ వర్సెస్ కెనడా, జూన్ 10న అమెరికా, ఇండియా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా

Virat Kohli: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్ ఆటగాడు..ఇక రోహిత్ శర్మ..

For more Sports News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 09:09 AM