Share News

IND vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్లు ఇవే!

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:52 PM

టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. గురువారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి...

IND vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్లు ఇవే!
India Won The Toss And Chose To Bat Against Afghanistan

టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. గురువారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గ్రూప్ దశలో భారీ స్కోరు నమోదు చేయలేకపోయిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి.. సెమీ ఫైనల్‌గా మార్గం సుగుమం చేసుకోవాలని భావిస్తోంది.

అవును.. గతంలో భారత్‌పై ఆఫ్ఘన్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించిన దాఖలాలు లేవు. అంత మాత్రాన ఆ జట్టుని అంత తేలిగ్గా తీసిపారెయ్యలేం. ఎందుకంటే.. మ్యాచ్‌ని మలుపు తిప్పగల కీలక ఆటగాళ్లు ఆఫ్ఘన్‌ జట్టులో ఉన్నారు. గతంలో పెద్ద పెద్ద టీమ్‌లను సైతం మూడు చెరువుల నీళ్లు తాగిపించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి.. భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా.. ప్రత్యర్థి జట్టుకి అవకాశం ఇవ్వకుండా.. సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘనిస్తాన్: గుర్బాజ్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా, ఇబ్రహీం, గుల్బదీన్, అజ్మతుల్లా, నబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీ

Updated Date - Jun 20 , 2024 | 07:52 PM