India vs Ireland: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Jun 05 , 2024 | 07:54 PM
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. బుధవారం భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇది 8వ మ్యాచ్. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. బుధవారం భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇది 8వ మ్యాచ్. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఐర్లాండ్ జట్టు రంగంలోకి దిగింది. ప్రత్యర్థి జట్టు పసికూన కాబట్టి.. భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని, ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌గా బోణీ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే.. గతంలో ఐర్లాండ్ జట్టు కొన్ని అద్భుతాలు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాపై ఎప్పుడూ గెలవలేదు కానీ.. కొన్ని బడా జట్లను మాత్రం గతంలో మట్టికరిపించింది. కాబట్టి.. ఐర్లాండ్‌ను అంత తక్కువ అంచనా కూడా వేయకూడదని క్రీడా నిపుణులు చెప్తున్నారు. ఆ జట్టులోనూ మెరుగ్గా రాణించే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారని.. వారిని ఎదుర్కోగలిగితే టీమిండియాదే గెలుపని సూచిస్తున్నారు. మరి.. టీ20లో ఆడబోతున్న తన తొలి మ్యాచ్‌లో భారత్ ఎలా నెగ్గుకువస్తుందో చూడాల్సిందే.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్‌బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్