Share News

Mohammad Shami: రీఎంట్రీలో అదరగొట్టిన షమీ.. బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టించాడు

ABN , Publish Date - Nov 16 , 2024 | 08:03 PM

రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

Mohammad Shami: రీఎంట్రీలో అదరగొట్టిన షమీ.. బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టించాడు
Mohammad shami

ఇండోర్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఏడాది తర్వాత అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. గాయం కారణంగా ఏడాదిపాటు జట్టుకు దూరమైన ఈ స్టార్ పేసర్ శనివారం జరిగిన రంజీ ట్రోఫీలో సత్తాచాటాడు. మధ్యప్రదేశ్ పై బెంగాల్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 7 వికెట్లు పడగొట్టి జట్టు గెలుపునకు తన వంతు సహకారం అందించాడు. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన షమీ బ్యాట్ తోనూ మెరుపులు చూపించాడు. రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ అద్భుతమైన ఫామ్ సానుకూల సంకేతాలను ఇస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో కష్టమైనప్పటికీ షమీ 24.2 ఓవర్లలో 3/102 పరుగులు చేశాడు. షాబాజ్ అహ్మద్ 4/48తో బౌలర్లలో ఎంపికయ్యాడు, అతని ఆల్ రౌండ్ ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.


షమీకి చోటు దక్కే చాన్స్..

దేశవాళీ క్రికెట్‌లో షమీ పునరాగమనం అతడి క్రికెట్ ప్రయాణంలో కీలకమైన అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షమీ చివరిసారిగా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత చీలమండలం గాయంతో ఈ స్టార్ పేసర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టు ఎంపికలోనూ షమీ అందుబాటులో లేడు. అయితే, రంజీ ట్రోఫీలో సత్తా చాటితే ఆసిస్ పర్యటనకు షమీని తీసుకుంటామని బీసీసీఐ ఇదివరకే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుపటి ఫామ్ ను అందుకోవడంతో ఆసిస్ తో మూడో టెస్టులో షమీకి చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Sanju Samson: సారీ చెప్పిన సంజూ.. చేయాల్సిందంతా చేసి ఆఖరికి క్షమాపణలు


Updated Date - Nov 16 , 2024 | 08:03 PM