Home » Ranji Trophy
రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న అతడు.. డబుల్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు.
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు చెలరేగాడు. వాళ్ల మీద ఉన్న కసిని బంతి మీద చూపించాడు. మెరుపు సెంచరీతో వారికి సవాల్ విసిరాడు.
వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీలతో వార్తల్లోకెక్కిన యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడి క్రికెట్ కెరీర్ కూడా ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.
శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.
రంజీ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు మళ్లీ ముంబై జట్టు 42వ సారి టైటిల్ గెల్చుకుంది. ఈ టోర్నీలో చివరి రౌండ్ వరకు విదర్భ ముంబయికి గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలవలేక పోయింది.
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై కరుణ్ నాయర్ (74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (56 బ్యాటింగ్) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ముంబైతో రంజీ ఫైనల్లో విదర్భ పోరాడుతోంది. 538 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 248 పరుగులు చేసింది.
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు.