MS Dhoni: ధోని ఇంట దీపావళి వేడుకలు.. ఢిఫరెంట్ లుక్‌లో మిస్టర్ కూల్
ABN , Publish Date - Nov 01 , 2024 | 05:23 PM
మిస్టర్ కూల్ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా మహి తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులందరితో కలిసి ధోనీ కనిపించాడు. భార్యతో కలిసి హోమం కార్యక్రమంలో పాల్గొన్నాడు. రెడ్ డ్రెస్ లో మహేంద్ర సింగ్ ధోని పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు.
గతేడాది భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ దీపావళి వేడుకలను ఎంఎస్ ధోనీ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నాడు. రిషబ్ పంత్ గాయాల నుంచి త్వరగా కొలుకోవడంతో ధోనీ పంత్ తో కలిసి పండగ జరుపుకున్నాడు. ఈ ఏడాది దిపావళి వేడుకల్లోనూ తన సన్నిహితులంతా ధోనీ ఇంట సందడి చేశారు.
ధోనీకి రూ. 4కోట్లు..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనిని రిటైన్ చేసుకున్న సంగతి తెలసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తమ మాజీ కెప్టెన్‌ను రూ.4 కోట్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకుంది. దీంతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతిసా పతిరానా, శివమ్ దూబేలను చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. రూ.18 కోట్లకు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలను చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. అదే సమయంలో మతిస పతిరనకు రూ.13 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. సీఎస్ కే తన ఆల్ రౌండర్ శివమ్ దూబేని 12 కోట్ల రూపాయలకు తన వద్దే ఉంచుకుంది. ఈ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.65 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ విధంగా మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.55 కోట్లకు చేరనుంది.