Share News

India vs Pakistan-T20 World Cup 2024: భారత్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:13 PM

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది.

India vs Pakistan-T20 World Cup 2024: భారత్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్

న్యూయార్క్: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు:

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.


రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే తాము కూడా తొలుత బౌలింగ్ చేసేవాళ్లమని అన్నాడు. ఈ పిచ్‌పై పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుందని, అంచనా వేసి ఆడాలని పేర్కొన్నాడు. మంచి స్కోర్‌ను సాధించి దానికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇదివరకే ఈ మైదానంలో మ్యాచ్‌లు ఆడడంతో పరిస్థితులను అంచనా వేయగలమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మంచి స్కోర్‌ సాధించడానికి కృషి చేస్తామని, సాధించిన స్కోర్‌ని డిఫెండ్ చేసుకోవడానికి తమకు చక్కటి బౌలింగ్ కూడా ఉందని అన్నాడు. ప్రపంచ కప్‌లో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదేనని, మ్యాచ్‌లో ఏమైనా జరగవచ్చునని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.

బాబర్ ఆజం మాట్లాడుతూ.. వాతావరణం, తేమ కారణంగా తాము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడబోతున్నామని, 100 శాతం సామర్థ్యంతో ఆడతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ వర్సెస్ పాక్‌ అంటే ఎప్పుడూ ఒత్తిడితో కూడిదేనని వ్యాఖ్యానించాడు.

Updated Date - Jun 09 , 2024 | 08:20 PM