Share News

Champions Trophy: హైబ్రిడ్ మోడల్‌కు ఓకే అంటే బంపర్ ఆఫర్.. పీసీబీని సంప్రదించిన ఐసీసీ

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:31 PM

ఒకవైపు పీసీబీ.. మరోవైపు బీసీసీఐ ఇరు జట్ల మధ్య సంధి కుదర్చలేక ఐసీసీ ఇరకాటంలో పడింది. ఎలాగైనా పీసీబీని ఒప్పించి షెడ్యూల్ ను ఖరారు చేయాలని తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పాక్ జట్టుకు భారీ ఆఫర్ ను ప్రకటించింది.

Champions Trophy: హైబ్రిడ్ మోడల్‌కు ఓకే అంటే బంపర్ ఆఫర్.. పీసీబీని సంప్రదించిన ఐసీసీ
PCB ICC

ఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత్ ససేమిరా అంటోంది. దీంతో ఈ మ్యాచ్ వేదికను తటస్థ వేదికపై ఏర్పాటు చేసేలా పాకిస్తాన్ జట్టును కన్విన్స్ చేసేందుకు ఐసీసీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ఓకే అనేలా ఐసీసీ కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. భారత్ తో జరిగే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించగలిగితే ఆ జట్టుకు ఆర్థిక ప్రోత్సాహకాలు పెంచుతామని చెప్పినట్టు తెలుస్తోంది.


‘‘ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏ ఫార్మాట్‌లో నిర్వహించాలనే దానిపై బోర్డు ప్రతినిధులు వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ భారత్ అర్హత సాధిస్తే, భారత్‌తో జరిగే మ్యాచులతో పాటు ఫైనల్ మ్యాచ్ ను దుబాయ్‌లో నిర్వహించేందుకు అనుమతించాలని అందుకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తామని పీసీబీని కోరుతున్నాం. పీసీబీ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికీ, పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే గ్రూప్ (స్టేజ్) మ్యాచ్, ఫైనల్‌ను లాహోర్‌లోనే నిర్వహించాలని కూడా పట్టుబట్టింది. సహజంగానే, భారత క్రికెట్ బోర్డు దీనికి అంగీకరించదు. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడాలని పట్టుబడుతోంది’’ అని ఐసీసీకి చెందిన సోర్స్ వెల్లడించింది.


షెడ్యూల్‌ను ప్రకటించడంలో జాప్యంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటివరకు స్పందిచలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో నిర్వహించాలని, భారత్ ఆడటం, ఆడకపోవడం ఆ జట్టు ఇష్టమని.. వేరే జట్లకు లేని సమస్య టీమిండియాకు మాత్రమే ఎందుకని పీసీబీ వాదిస్తోంది. "మాకు సంబంధించినంతవరకు, కరాచీ, లాహోర్, రావల్పిండిలోని మూడు స్టేడియంలలో నిర్మాణ పనులతో సహా టోర్నమెంట్ కోసం అన్ని సన్నాహాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయి" అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.

Vaibhav Suryavanshi: వైభవ్‌పై కాంట్రవర్సీ.. ఐపీఎల్‌లో ఫ్రాడ్ అంటూ ఆరోపణలు.. స్పందించిన తండ్రి


Updated Date - Nov 26 , 2024 | 04:32 PM