Share News

Cricket: క్రికెట్‌ను శాసించిన తోపులు.. ఒక్క దెబ్బకు గుడ్‌బై

ABN , Publish Date - Dec 02 , 2024 | 07:28 PM

Cricket: ఆషామాషీ ప్లేయర్లు కాదు. బరిలోకి దిగితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్నవారు. వాళ్లను చూస్తేనే ప్రత్యర్థులు జడుసుకునేవారు. మ్యాచ్‌కు ముందే వాళ్లకు సరెండర్ అయ్యేవారు. లెజెండ్లుగా మారాల్సిన ఆ స్టార్లు.. కెరీర్ మధ్యలోనే గేమ్‌కు గుడ్‌బై చెప్పేశారు.

Cricket: క్రికెట్‌ను శాసించిన తోపులు.. ఒక్క దెబ్బకు గుడ్‌బై

ఆషామాషీ ప్లేయర్లు కాదు. బరిలోకి దిగితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్నవారు. వాళ్లను చూస్తేనే ప్రత్యర్థులు జడుసుకునేవారు. మ్యాచ్‌కు ముందే వాళ్లకు సరెండర్ అయ్యేవారు. లెజెండ్లుగా మారాల్సిన ఆ స్టార్లు.. కెరీర్ మధ్యలోనే గేమ్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇంకా చాలా ఏళ్లు ఆడే సత్తా ఉన్నా ఒక్క దెబ్బతో ఆట నుంచి తప్పుకున్నారు. వాళ్ల ఆటను మరికొన్నేళ్లు ఆస్వాదిద్దామని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు టాలెంటెడ్ క్రికెటర్లు జెంటిల్మన్ గేమ్‌‌ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎవరా స్టార్లు? వాళ్ల రిటైర్మెంట్‌కు గల కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


ఫిల్ హ్యూజెస్

ఆస్ట్రేలియా ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఫిల్ హ్యూజెస్ బంతి తగిలి మృతి చెందాడు. డొమెస్టిక్ మ్యాచ్‌లో సీన్ అబాట్ అనే బౌలర్ విసిరిన రాకాసి బౌన్సర్‌ మెడ మీద తగలడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు హ్యూజెస్. బాల్ బలంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపాయాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా మూడ్రోజుల తర్వాత చనిపోయాడు. హ్యూజెస్ బ్యాటింగ్ టాలెంట్ చూసి ఆసీస్‌కు మరో ఆణిముత్యం దొరికాడని అంతా సంబురపడ్డారు. కానీ అది జరగలేదు. క్రికెట్‌లో పెను విషాదంగా ఈ ఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


మార్క్ బౌచర్

గాయం కారణంగా గేమ్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో సౌతాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచర్ కూడా ఒకడు. 2012లో కెరీర్‌లో పీక్‌లో ఉన్నాడతను. 1,000 క్యాచుల రికార్డుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన గూగ్లీని అందుకోబోయి గాయపడ్డాడు బౌచర్. వికెట్లను బంతి తాకగా.. గాల్లోకి లేచిన స్టంప్స్ వెళ్లి అతడి కంటికి తగిలాయి. ఆ ఇంజ్యురీ నుంచి కోలుకోకపోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.


జొనాథన్ ట్రాట్

క్రికెట్‌కు ఇంగ్లండ్‌ అందించిన అద్భుతమైన ప్లేయర్లలో ఒకడిగా జొనాథన్ ట్రాట్ గురించి చెబుతుంటారు. పరుగుల వరద పారించి తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగాడు ట్రాట్. అయితే మానసిక సమస్యలతో అతడు 2018లో ఆట నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. ఆ సమయంలో ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ట్రాట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ కారణం వల్లే అతడు మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చినా సక్సెస్ కాలేదని అంటుంటారు.


నాథన్ బ్రాకెన్

నాథన్ బ్రాకెన్.. అప్పట్లో ఈ ఆస్ట్రేలియా పేసర్ పేరు వింటే తోపు బ్యాటర్లు కూడా భయపడేవారు. భారత్ దగ్గర నుంచి అన్ని టాప్ టీమ్స్‌ను లెఫ్టార్మ్ సీమ్ బౌలింగ్‌తో భయపెట్టాడు బ్రాకెన్. అయితే 2009లో మోకాలికి గాయమవడంతో ఆటకు దూరమయ్యాడు. డాక్టర్లు సరిగ్గా ట్రీట్‌మెంట్ చేయకపోవడంతో అతడి కెరీర్‌కు మధ్యలోనే ఎండ్ కార్డ్ పడింది.


క్రెయిగ్ కీస్వెట్టర్

ఇంగ్లండ్ క్రికెట్‌లోకి కొత్త హీరో వచ్చాడంటూ అప్పట్లో కీస్వెట్టర్ గురించి గొప్పగా చెప్పుకునేవారు. టీ20 వరల్డ్ కప్-2010 ఫైనల్‌లో అతడు బ్యాటింగ్ చేసిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న కీస్వెట్టర్ కెరీర్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. కౌంటీ క్రికెట్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో అతడి హెల్మెట్‌లో నుంచి దూసుకొచ్చిన బాల్ ముఖానికి బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు పగిలింది. ఈ ఘటన తర్వాత కొన్నేళ్లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.


Also Read:

పంత్‌ను దించేసిన పూరన్.. కిందపడినా సిక్స్ బాదేశాడు

500 కోట్లు మిస్.. చేజేతులా చేసుకున్న బుమ్రా

చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే

వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి

For More Sports And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 07:33 PM