CSK vs PBKS: టాస్ ఓడిన చెన్నై జట్టు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - May 05 , 2024 | 03:18 PM
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో..
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు చెన్నై జట్టు రంగంలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ఇదివరకే ఇరుజట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. అది కూడా వారి సొంతం మైదానంలో ఓడించారు. దీంతో.. చెన్నై అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎలాగైతే తమని హోమ్ గ్రౌండ్లో ఓడించారో, అలాగే పంజాబ్‌ని వారి సొంత మైదానంలో ఓడించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
కాగా.. ధర్మశాల మైదానం కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ కాస్త బలమైన షాట్లు కొడితే.. బంతి బౌండరీ లైన్ దాటిపోతుంది. దీనికితోడు.. హైబ్రిడ్ పిచ్ కాబట్టి, కొత్త బంతికి సహకారం లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే.. బ్యాటర్లు కాసేపు క్రీజులో కుదురుకుంటే, బ్యాటర్లు ఊచకోత కోయొచ్చన్నమాట. ముఖ్యంగా.. స్పిన్నర్స్‌కి ఇబ్బంది తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే ఇరుజట్లలో పవర్ హిట్టర్స్ బాగానే ఉన్నారు. కాబట్టి.. ఈ మ్యాచ్‌లో పరుగుల సునామీని ఆశించొచ్చు. పైగా.. ఇరు జట్లకు, మరీ ముఖ్యంగా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ పంజాబ్ జట్టుకి ఎంతో కీలకమైంది. మరి, హోరాహోరీగా సాగే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
పంజాబ్ తుది జట్టు:
జానీ బెయిర్‌స్టో, రిలీ రోసో, శశాంక్ సింగ్, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
చెన్నై తుది జట్టు:
అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే