Share News

Ravichandran Aswin: షేర్ ఆగయా.. అశ్విన్ కోసం పెద్ద ప్లానింగే.. ఫలించిన సీఎస్‌కే వ్యూహం

ABN , Publish Date - Nov 24 , 2024 | 08:11 PM

కేవలం రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అశ్విన్ కు అనుకోకుండా తీవ్ర పోటీ ఏర్పడింది. అశ్విన్ ను కొనేందుకు హైదరాబాద్‌తో పాటు ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పోటీ పడ్డాయి.

Ravichandran Aswin: షేర్ ఆగయా.. అశ్విన్ కోసం పెద్ద ప్లానింగే.. ఫలించిన సీఎస్‌కే వ్యూహం
Aswin ravichandran

ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ వేలంలో మరోసారి సత్తా చాటాడు. కేవలం రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అశ్విన్ కు అనుకోకుండా తీవ్ర పోటీ ఏర్పడింది. అశ్విన్ ను కొనేందుకు హైదరాబాద్‌తో పాటు ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పోటీ పడ్డాయి. ఆఖరికి ఒకప్పుడు వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టే అతడిని రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, సీఎస్ కే జట్టు అశ్విన్ ను సొంతం చేసుకునేందుకు ఎప్పటినుంచో ఎదురుచూస్తోందని.. ప్లాన్ ప్రకారమే పోటీని తట్టుకుని మరీ ఈ ఆటగాడిని ఒడిసిపట్టిందని అంటున్నారు.


దాదాపు రెండు వందల ఐపీఎల్ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న అశ్విన్.. చెన్నై జట్టుతోనే ఐపీఎల్ కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్ 17 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ స్నిన్నర్ ను ఆ జట్టు వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అశ్విన్ రాకతో చెన్నై జట్టు మరింత స్ట్రాంగ్ గా మారనుందని సీఎస్ కే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేలంలో ఒక్కసారిగా అశ్విన్ కోసం అన్ని జట్లు పోటీ పడటంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

Updated Date - Nov 24 , 2024 | 08:11 PM