Rohit vs Shami: టీమిండియా స్టార్ల మధ్య చిచ్చురేపిన గాయం.. షమీ, రోహిత్ మధ్య గొడవేంటి..
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:43 PM
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ షమీ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు అభిమానులను గందరగోళంలో పడేశాయి. అతడింకా జట్టులో చేరేందుకు అవసరమైన ఫిట్ నెస్ తో లేడంటూ రోహిత్ మీడియాతో చెప్పాడు. అదే సమయంలో షమీ దూకుడు ప్రదర్శనకు రోహిత్ కామెంట్స్ కి మధ్య లెక్క సరిపోవడం లేదు.. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య కొంత కాలంగా సంబంధాలు సరిగ్గా లేవంటూ ప్రచారం జరుగుతోంది. షమీ ఫిట్ నెస్ పై రోహిత్ పలుమార్లు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. షమీ గాయంపై అతడో వెర్షన్ వినిపిస్తుంటే.. రోహిత్ చెప్తున్న మాటలు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. గతంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీ పాల్గొంటాడా అని రోహిత్ ని అడగ్గా అతడిచ్చిన సమాధానం షమీకి కోపం తెప్పించినట్టుగా తెలుస్తోంది.
పొంతన లేని స్టేట్మెంట్స్..

అలా మొదలైంది..
ఇక ఇటీవల రెండో టెస్టు అనంతరం రోహిత్ మాట్లాడుతూ... ‘‘షమీ కోసం ఎప్పుడూ టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ, మేనేజిమెంట్ అతడిని తీసుకోవడానికి తొందరపడటం లేదు. షమీ విరామం తీసుకుని చాలా కాలం గడిచిన కారణంగా మేం అతడి విషయంలో వంద శాతానికి మించి ఆశిస్తున్నాం. అతడు ఇక్కడకు వచ్చి టీమ్ కోసం ఆడాలని మేం అతడిని ఒత్తిడి చేయాలని అనుకోవడం లేదు. ఇక్కడ కొందరు ప్రొఫెషనల్స్ ఉంటారు. వారి నిర్ణయాన్ని బట్టే జట్టులో ఎవరు ఆడాలనే విషయం నిర్దారిస్తారు. వాళ్లే షమీని అనుక్షణం కనిపెడుతుంటారు. మ్యాచ్ తర్వాత, గేమ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 20 గంటల పాటు నిలబడే ఉండటం.. ఇవన్నీ వారు నిశితంగా గమనిస్తారు. అయినప్పటికీ షమీకి డోర్స్ ఎప్పుడూ ఓపెన్ గానే ఉంచుతాం. అతడెప్పుడు కావాలన్నా జట్టు తరఫున ఆడొచ్చు అని రోహిత్ తెలిపాడు. అదనంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ మోకాలికి గాయం అయినట్టుగా కూడా రోహిత్ వివరించాడు.