IPL Auction: ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే
ABN , Publish Date - Nov 06 , 2024 | 08:03 AM
మరికొన్ని రోజుల్లోనే జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ ఆటగాళ్లు కదా, 409 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో 320 క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత ఆటగాళ్ల జాబితాను తగ్గించనున్నారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నిర్వహించనున్నట్టు తెలిపింది. మరికొన్ని రోజుల్లోనే జరగనున్న ఈ వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో 320 క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత వేలంలోని ఆటగాళ్ల సంఖ్యను తగ్గించనున్నారు.
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లో పంత్
రికార్డు స్థాయి ధరకు ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయని భావిస్తున్న స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తమ పేర్లను లిస్ట్ చేసుకున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ బేస్ ధరలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో జేమ్స్ ఆండర్సన్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టీ నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ కూడా ఉన్నారు. గత ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు స్థాయిలో రూ.24.50 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఈ కేటగిరిలోనే పేరు నమోదు చేసుకున్నాడు. అత్యధిక బేస్ ప్రైస్ కేటగిరి ఇవే కావడం గమనార్హం.
రూ.75 లక్షల బేస్ ప్రైస్‌లో ఉన్నది వీళ్లే..
రూ.75 లక్షల బేస్ ప్రైస్ కేటగిరిలో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. పృథ్వీ షా కూడా ఈ కేటగిరిలో పేర్చు లిస్ట్ చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న చాలా మంది ప్లేయర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలంలో పేరు కనిపించలేదు. అయితే ఆశ్చర్యకంగా ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ రూ.1.25 కోట్ల బేస్ ధరతో తన పేరుని రిజిస్టర్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే
అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
For more International News and Telugu News