Share News

Vinod Kambli: ఒకప్పటి క్రికెట్ లెజెండ్.. సచిన్ ప్రాణ స్నేహితుడు ఇప్పుడిలా..

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:00 PM

ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకే వేదికపై కలుసుకున్నారు. సచిన్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Vinod Kambli: ఒకప్పటి క్రికెట్ లెజెండ్.. సచిన్ ప్రాణ స్నేహితుడు ఇప్పుడిలా..
Sachin Vinod Kambli

ముంబై: చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరు క్రికెట్ లో లెజెండ్ గా పేరు తెచ్చుకోగా మరొకరు.. ఫామ్ ను కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. ఇప్పుడు కనీసం లేచి నడవలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. అతనే వినోద్ కాంబ్లి. సచిన్ కు ఆప్త మిత్రుడు. నేటి తరానికి ఈ పేరు అంత సుపరిచితం కాకున్నా.. పాత తరం వారికి కాంబ్లి గురించి బాగా తెలుసు. సచిన్, కాంబ్లీ ఇద్దరూ అచ్రేకర్ దగ్గర శిష్యరికం చేసిన వారే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరూ రికార్డులు బద్దలుగొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి ఒకరిని మించి మరొకరు పేరు సంపాదించారు. తర్వాత సచిన్ క్రికెట్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కానీ, కాంబ్లి వైభవం కనుమరుగైంది. కనీసం అతనెక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియనంతగా ఆటకు దూరమయ్యాడు.


సచిన్ చేతిని బిగ్గరగా పట్టుకుని..

తాజాగా చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమం వేదికపై కలుసుకున్నారు. ఈ ఈవెంట్ కు సచిన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అక్కడ కాంబ్లీని చూసిన సచిన్ ఆప్యాయంగా పలకరించాడు. మొదట తన స్నేహితుడిని గుర్తుపట్టని కాంబ్లి ఆ తర్వాత వెంటనే అతడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. స్టేజి మీదకి రావాలంటూ హోస్ట్ సచిన్ పేరును పదే పదే పిలుస్తుండటంతో సచిన్ ప్రయత్నపూర్వకంగా అతడి చేతిని వదిలించుకుని ముందుకు కదిలాడు.


పతాక వార్తల నుంచి పతనంవైపుకు..

ఒకప్పుడు కాంబ్లి సచిన్ ను మించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్ తో అద్భుతాలు చేశాడు. కానీ, వ్యసనం అతడి కెరీర్ ను నాశనం చేసింది. మద్యానికి బానిసవ్వడంతో కాంబ్లి క్రికెట్ లో కనుమరుగయ్యాడని క్రీడా విశ్లేషకులు చెప్తుంటారు. ఆర్థికంగానూ అతడి పరిస్థితి బాగాలేదని సమాచారం. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనూ బతుకీడుస్తున్నట్టుగా తెలుస్తోంది. 2012 నుంచి ఆరోగ్య సమస్యలు అతడ్ని చుట్టుముట్టాయి. 2013లో గుండెపోటుకు గురవ్వడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. యాంజియోస్లాస్టీ తర్వాత కోలుకున్నప్పటికీ మునుపటిలా కోలుకోలేకపోయాడు.

Harbhajan Singh: ఆ రోజు నుంచీ మా ఇద్దరికీ మాటల్లేవ్.. ధోనీపై హర్భజన్ షాకింగ్ కామెంట్స్


Updated Date - Dec 04 , 2024 | 12:38 PM