Share News

Sarfaraj khan: న్యూజిలాండ్ పై కొత్త కుర్రాడి శతకం

ABN , Publish Date - Oct 19 , 2024 | 02:00 PM

న్యూజిలాండ్ తో టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ మెరుపు సెంచరీలతో అదరగొట్టాడు. కెరీర్ లో తొలిసెంచరీ నమోదు చేసి ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించాడు. దీంతో సర్ఫరాజ్ కు క్రికెట్ అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Sarfaraj khan: న్యూజిలాండ్ పై కొత్త కుర్రాడి శతకం
sarfaraj khan

బెంగళూరు: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ షాట్లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఉర్రూతలూగిపోయింది. న్యూజిలాండ్ తో టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ మెరుపు సెంచరీలతో అదరగొట్టాడు. కెరీర్ లో తొలిసెంచరీ నమోదు చేసి ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించాడు. దీంతో సర్ఫరాజ్ కు క్రికెట్ అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సెంచరీ తర్వాత క్రీజులో సర్ఫరాజ్ చేసిన ఫీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. సంతోషంతో మైదానం మొత్తం తిరుగుతూ కేరింతలు కొట్టాడు. తోటి ప్లేయర్స్ చప్పట్లతో అభినందనలు తెలిపారు. అందుకు రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వీడియోలు సైతం క్రికెట్ అభిమానులు షేర్ చేస్తున్నారు.


హైరిస్క్ షాట్లతో చెలరేగి..

నాలుగో రోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో కలిసి క్రీజులోకి దిగిన సర్ఫరాజ్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. హై రిస్క్ షాట్లతో కేవలం 113 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్ లతో సెంచరీ పూర్తి చేశాడు. కొన్నిసార్లు ప్రత్యర్థి బౌలర్లను సైతం లెక్కచేయకుండా ఎదురుదాడికి దిగాడు. దీంతో టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన మార్కును సర్ఫరాజ్ అందుకున్నాడు. సర్ఫరాజ్ సెంచరీ, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సౌజన్యంతో న్యూజిలాండ్‌కు నాలుగో ఇన్నింగ్స్‌లో తగిన లక్ష్యాన్ని అందించడానికి భారత్ సిద్ధమైంది.


సెంచరీతో రేర్ ఫీట్..

గాయంతో బాధపడుతున్న శుభ్ మన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ప్రారంభంలో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే 4 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ తో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించాడు. ఒకే టెస్టులో డకౌట్ చేస్తూ సెంచరీ కొట్టిన ఘనత ఈ ప్లేయర్ దే కానుంది.


లేటెస్ట్ వెర్షన్ లా ఉన్నాడు..

సర్ఫరాజ్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ప్రశంసలు కురిపించాడు. అతడి ఇన్నింగ్స్ ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సర్ఫరాజ్ అద్బుతంగా ఆడాడు. అతడి ఆట 1980 నాటి ప్లేయర్ జావేద్ మియాందాద్ను గుర్తుచేస్తుంది. ఇతడు 2024 వెర్షన్ ఆఫ్ జావెద్ మియాందాద్ లా ఉన్నాడు. స్పిన్ తో పాటుగా పేసర్లను సైతం నేర్పుతో ఎదుర్కొంటున్నాడు అంటూ మంజ్రేకర్ తన పోస్టులో సంతోషం వ్యక్తం చేశాడు.

Updated Date - Oct 19 , 2024 | 02:01 PM