Sri Lanka vs India, 2nd ODI: ముగిసిన శ్రీలంక బ్యాటింగ్.. భారత లక్ష్యం ఎంతంటే?
ABN , Publish Date - Aug 04 , 2024 | 06:38 PM
భారత బౌలర్లు మరోసారి రాణించారు. కొలంబో వేదికగా శ్రీలంక జరుగుతున్న రెండో వన్డేలో అంచనాలకు తగ్గట్టు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌కు తోడు కుల్దీప్ యాదవ్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 స్కోర్ నమోదు చేసింది.
కొలంబో: భారత బౌలర్లు మరోసారి రాణించారు. కొలంబో వేదికగా శ్రీలంక జరుగుతున్న రెండో వన్డేలో అంచనాలకు తగ్గట్టు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌కు తోడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 స్కోర్ నమోదు చేసింది. దీంతో భారత విజయ లక్ష్యం 241 పరుగులుగా ఉంది.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 3 వికెట్లు తీశారు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
ఇక శ్రీలంక బ్యాటర్లలో అవిస్కా ఫెర్నాండో, కమింద్ మెండిస్ చెరో 40 పరుగులు బాది తమ జట్టు ఛాలెంజింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే.. ఓపెనర్ పతుం నిస్సాంక.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. కుశాల్ మెండిస్ 30 పరుగులు, సమరవిక్రమ 14, అసలంక 25, జనిత్ లియానేజ్ 12, దునిత్ వెల్లలాగే 39, ధనంజయ 15, వాండర్సే 1 (నాటౌట్) చొప్పున పరుగులు బాదారు.