Share News

Sarfaraj khan: లావుగా ఉన్నాడని వద్దన్నారు..

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:44 PM

తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన ప్లేయరే ఆ వెంటనే 150 పరుగులతో సెంచరీ కొడతాడని ఎవరూ ఊహించలేదు. మరి ఈ యువ సంచలనానికి ఇప్పటివరకు జట్టులో ఎందుకు చోటు దక్కలేదని అంతా ప్రశ్నిస్తున్నారు.

Sarfaraj khan: లావుగా ఉన్నాడని వద్దన్నారు..
Sarfaraj khan

ముంబై: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ సిరీస్ తర్వాత యువ ఆటగాడు సర్ఫరాజ్ పేరు మార్మోగిపోతోంది. అతడి టాలెంట్ చూసిన వారంతా ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన ప్లేయరే ఆ వెంటనే 150 పరుగులతో సెంచరీ కొడతాడని ఎవరూ ఊహించలేదు. మరి ఈ యువ సంచలనానికి ఇప్పటివరకు జట్టులో ఎందుకు చోటు దక్కలేదని అంతా ప్రశ్నిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సర్ఫరాజ్ పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో యోయో టెస్టు పేరుతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ను మాత్రమే కొలుస్తూ ప్రతిభను పక్కనపెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


నడుము సన్నగా లేదని..

దేశవాలీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా ఈ ఫిట్‌నెస్ టెస్టులేనని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపిక చేసేందుకు సర్ఫరాజ్ లావుగా ఉన్నాడని ఫిట్‌నెస్ లేదని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అతడి నడుము సైజు కన్నా గొప్ప క్రికెట్ ఆడాడు అని మెచ్చుకున్నారు. భారత క్రికెట్ లో నిర్ణయాధికారాలు ఎక్కువగా ఉండటం బాధాకరమని గవాస్కర్ మండిపడ్డాడు.


పంత్ ను సైతం..

రిషభ్ పంత్ ను సైతం ఇదే కారణంతో పక్కన పెట్టారన్నాడు. ’పంత్ రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. 6 గంటలకుపైగా ఆట కోసం వంగిలేస్తున్నాడు. త్రోలను అందుకోవడం కోసం స్టంప్స్ దగ్గరకు పరిగెత్తుతున్నాడు' అని తెలిపాడు. ఇప్పటికైనా ఆటగాళ్ల శరీరాకృతి మాత్రమే కాకుండా వారు మానసికంగా ఎంత సన్నద్ధంగా ఉన్నారనే విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని గవాస్కర్ చురకలు అంటించాడు.

Virat Kohli: ఒత్తిడికి దూరంగా విరాట్ కోహ్లీ.. భార్యతో భక్తి కాన్సర్ట్‌కు

Updated Date - Oct 21 , 2024 | 05:27 PM