T20 World Cup: హార్దిక్ పాండ్యా ఎంపికపై విమర్శలు.. గవాస్కర్ ఏమన్నాడంటే?
ABN , Publish Date - May 01 , 2024 | 09:17 PM
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టుపై క్రీడాభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా ఎంపికని
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం (T20 World Cup) భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టుపై క్రీడాభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఎంపికని చాలామంది తప్పు పడుతున్నారు. పాండ్యా ఇప్పుడు ఏమాత్రం ఫామ్‌లో లేడని, అతడిని ఎందుకు ఎంపి చేశారని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న వాళ్లని కాదని, పాండ్యాని తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఇందుకు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఇదొక చెత్త సెలక్షన్.. ఆ ప్లేయర్‌ని పక్కన పెట్టడమేంటి?
‘‘ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు. ఐపీఎల్‌లో ఆడటానికి, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి చాలా తేడా ఉంటుంది. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు.. ప్రతి ఆటగాడు ఎంతో గర్వంగా ఫీలవుతాడు. హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అతడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటున్నాడు. అయినా వాటిని అధిగమిస్తూ.. తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. వరల్డ్‌కప్ కోసం భారత్ తరఫున రంగంలోకి దిగినప్పుడు.. పాండ్యా మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాండ్యా భాగస్వామ్యం ఎంతో కీలకం అవుతుంది. ఈ టోర్నీలో భారత్ తప్పకుండా టైటిల్ రేసులో ముందంజలో ఉంటుంది’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ
అయితే.. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే, సమిష్టి కృషితో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఎంపిక చేసిన భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లందరూ ఫామ్‌లో ఉన్నారని, ఈ టీమ్‌కి లక్ ఉందని తాను భావిస్తున్నానని చెప్పాడు. భారత జట్టుని చూస్తుంటే.. 2007 నాటి పరిణామాలు మళ్లీ రిపీట్ అవుతాయని, భారత్‌కి టీ20 వరల్డ్‌కప్ రావడం తథ్యమని నమ్మకం వెలిబుచ్చాడు. మరి, ఆయనతో పాటు భారతీయులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ టీమ్ నిలబెడుతుందా? టీ20 వరల్డ్‌కప్‌ని సొంతం చేసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Read Latest Sports News and Telugu News