Share News

SRH vs CSK: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:05 PM

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాల్సి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకుంది.

SRH vs CSK: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్

చెన్నై: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాల్సి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైలో రాత్రిపూట మంచుకురిసే అవకాశం ఉండడంతో తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వెల్లడించారు. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌తో వెళ్తున్నామని, స్పిన్నర్ మార్కండేను పక్కనపెడుతున్నట్టు కమ్మిన్స్ వివరించాడు.

తుది జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరణ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్

Updated Date - Apr 28 , 2024 | 07:11 PM