Bangladesh: బంగ్లా జట్టుకు కెప్టెన్ కొరత.. నేనున్నానంటున్న సీనియర్ ప్లేయర్
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:51 PM
ప్రస్తుత కెప్టెన్ తప్పుకోవడం, జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ కూడా ఆటకు వీడ్కోలు పలకడంతో బంగ్లా జట్టు సందిగ్దంలో పడింది. జట్టుకు కొత్త కెప్టెన్ కోసం తీవ్రంగా గాలిస్తోంది.
ఢాకా: క్రీజులో ప్రత్యర్థకి చెమటలు పట్టించే చేసే బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం కెప్టెన్సీ కొరతతో బాధపడుతోంది. బంగ్లాదేశ్ ప్రస్తుత కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత తన బాధ్యతల నుండి వైదొలగనున్నట్లు సమాచారం. ఇటీవల బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కూడా శాంటో గైర్హాజరవ్వడంతో ఆ విషయం మరింత బహిర్గతమైంది.
కెప్టెన్సీ కోసం తైజుల్ పోటీ..
అతడి స్థానంలో తైజుల్ ఇస్లాం జట్టు తరఫున మీడియాతో మాట్లాడాడు. అసలు నజ్ముల్ మీడియా సమావేశానికి ఎందుకు రాలేదనే ప్రశ్నకు తైజుల్ స్పందిస్తూ.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నజ్ముల్ తీసుకున్న నిర్ణయం తనకు తెలియదు. నాకు ఈ విషయాల గురించి అవగాహన లేదు. నజ్ముల్ కెప్టెన్సీ నుండి వైదొలగడం గురించి నాకేమీ తెలియదు. నేను దీనికి సమాధానం ఇవ్వలేను. అయినా ఇది నా పని కాదు’’ అని తైజుల్ తెలివిగా తప్పుకున్నాడు. నిజానికి నజ్ముల్ తర్వాత జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు తైజుల్ ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది.
ఆసక్తి చూపని సెలక్టర్లు..
జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కూడా ఆటకు వీడ్కోలు పలకడంతో బంగ్లా జట్టుకు సందిగ్దంలో పడింది. జట్టులో నుంచే ఒక క్రికెటర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే చాన్స్ ఉన్నాడు. సెప్టెంబరు 2014లో వెస్టిండీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి బంగ్లాదేశ్ తరపున 48 టెస్టులు, 20 వన్డేలు, రెండు టీ20లు ఆడిన సీనియర్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం.. 10 ఏళ్ల అనుభవం ఉన్న తాను టెస్ట్ కెప్టెన్సీని తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ప్రకటించాడు. కానీ బోర్డు సభ్యులు, సెలక్టర్లు మాత్రం శాంటో ఎవరిపేరునైనా ప్రతిపాదిస్తాడా అని ఎదురుచూస్తున్నారు.