Share News

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్‌కు బంగారు పతకం.. వరుసగా మూడో పతకాన్ని సాధించిన విక్టర్ ఆక్సెల్సెన్‌‌

ABN , Publish Date - Aug 05 , 2024 | 08:47 PM

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్‌‌ సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో రాణించిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్‌సర్న్‌పై 21-11, 21-11 తేడాతో వరుస రెండు సెట్లలో విజయం సాధించి బంగారు పతకం సాధించాడు.

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్‌కు బంగారు పతకం.. వరుసగా మూడో పతకాన్ని సాధించిన విక్టర్ ఆక్సెల్సెన్‌‌
Viktor Alexsen

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్‌‌ సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో రాణించిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్‌సర్న్‌పై 21-11, 21-11 తేడాతో వరుస రెండు సెట్లలో విజయం సాధించి బంగారు పతకం సాధించాడు. దీంతో విటిద్‌సర్న్‌ రజతంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో అలవోకగా విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌లో లక్ష్యసేన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే కొంచెం శ్రమించాల్సిన వచ్చినప్పటికీ మిగిలిన అన్ని మ్యాచుల్లో డెన్మార్క్ ఆటగాడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో వరుసగా మూడు పతకాలు సాధించిన ఆటగాడి జాబితాలో ఆక్సెల్సెన్ చోటు సంపాదించాడు. ఇప్పటిరవకు లీ చోంగ్ వీ (మలేషియా), చెన్ లాంగ్ (చైనా) మాత్రమే వరుసగా ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించారు.

జొకో సాధించాడు


వరుసగా మూడో పతకం

డెన్మార్క్‌కు చెందిన ఆక్సెల్సెన్ ఒలింపిక్స్‌లో వరుసగా మూడో పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధిచిన ఆక్సెల్సెన్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించి.. విశ్వ క్రీడల్లో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన చైనా క్రీడాకారుడు లిన్ డాన్ రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన రికార్డు లిన్ డాన్‌ పేరిట ఉంది. అతడు 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో బంగారు పతకాలు సాధించాడు. తాజాగా డెన్మార్క్ క్రీడాకారుడు ఆక్సెల్సెన్ ఆ రికార్డును సమం చేశాడు. 1992 నుంచి ఇప్పటిరవకు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు సార్లు చైనా బంగారు పతకాలు గెలవగా.. ఆ తర్వత స్థానంలో 3 పతకాలతో డెన్మార్క్ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో రెండు స్వర్ణ పతకాలతో ఇండోనేషియా నిలిచింది. ఇప్పటిరవకు ఒలింపిక్స్‌ చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకాన్ని డెన్మార్క్, చైనా , ఇండోనేషియా క్రీడాకారులే సొంత చేసుకున్నారు.

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం


పారిస్ ఒలింపిక్స్‌లో

ఆక్సెల్సెన్ గ్రూపు దశలో వరుస మూడు మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఐర్లాండ్ ఆటగాడు నాట్ న్గుయెన్‌పై వరుస రెండు సెట్లలో విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింగపూర్ ఆటగాడు లోహ్ కీన్ యూపై 21-9, 21-17 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్స్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్‌పై 22-20, 21-14 తేడాతో గెలిచి ఫైనల్స్‌కు ప్రవేశించాడు. ఫైనల్స్‌లో వరుస రెండు సెట్లలో గెలిచి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తాను ఆడిన అన్ని మ్యాచుల్లో ఒక సెట్‌ కూడా ఓడిపోలేదు ఆక్సెల్సెన్. వరుస విజయాలతో ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు.

Gymnastics : బంగారు బైల్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 08:47 PM