Home » olympics
AP Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏపీ జితేందర్ రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల గురించి మరింత వివరాలు మీ కోసం..
Olympics 2036: ఒలింపిక్స్ నిర్వహించాలనేది భారత్ ఎన్నాళ్లుగానో కంటున్న కల. కానీ ఇప్పటిదాకా అది నెరవేరలేదు. క్రీడాభిమానులు కూడా ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు.
భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు
పారిస్ పారా ఒలింపిక్స్‌లో 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ ఆమె కొట్టిన ఓ షాట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించింది.
క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ రైఫిల్ షూటింగ్ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.
ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ
రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
వినేష్ ఫోగట్ వంద నుంచి 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌లో ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బంగారు పతకం పోవడంతో ఓవైపు భారతీయులంతా నిరాశతో ఉన్నారు.