Dipa Karmakar: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న దీపా కర్మాకర్
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:57 AM
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024లో మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ప్రముఖ క్రీడాకారిణి దీపా కర్మాకర్(Dipa Karmakar) మహిళల ఆల్‌రౌండ్ విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నారు.
ఒడిశా(odisha)లోని భువనేశ్వర్‌లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024లో మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ప్రముఖ క్రీడాకారిణి దీపా కర్మాకర్(Dipa Karmakar) మహిళల ఆల్‌రౌండ్ విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నారు. ఈ పోటీలో మొత్తం 49.55 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత సీనియర్ నేషనల్స్ పోటీల్లో పాల్గొన్నప్పటికీ గోల్డ్ గెలవడం గొప్పగా భావిస్తున్నానని ఆమె చెప్పింది. ఈ ప్రదర్శనతో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు దీపా కర్మాకర్ చెప్పారు. దీపా కర్మాకర్ 2015 నుంచి మొదటి జాతీయ పోటీలలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే రియో 2016 ఒలింపియన్, కామన్వెల్త్ గేమ్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం కైవసం చేసుకుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Skydiving: రాముడి జెండాతో యువతి స్కైడైవింగ్.. ఏకంగా 13 వేల అడుగులపై నుంచి...
మరోవైపు నేషనల్ గేమ్స్ 2023లో స్వర్ణ పతక విజేత ప్రణతి దాస్ 47.00 స్కోర్ చేసి రజతం సాధించగా, స్వస్తిక గంగూలీ (45.30) ఆల్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్ మహిళల వాల్ట్, అన్ ఈవెన్ బార్స్ వ్యక్తిగత విభాగాల్లో వరుసగా రెండు రజత(silver) పతకాలను కైవసం చేసుకోవడం విశేషం. ఇక వాల్ట్ విభాగంలో టోక్యో ఒలింపియన్ ప్రణతి నాయక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ప్రొటిష్ట సమంత కాంస్యం సాధించింది. అదే సమయంలో మహిళల అసమాన బార్‌లు, ఫ్లోర్ వ్యాయామ ఈవెంట్‌లో ప్రణతి దాస్ అగ్రస్థానంలో నిలిచింది. రీతూ దాస్ బ్యాలెన్స్ బీమ్‌లో గోల్డ్ గెల్చుకుంది.