Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు మొయిన్ అలీ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్..
ABN , Publish Date - Sep 08 , 2024 | 09:41 PM
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. వారిలో మొయిన్ అలీ కూడా ఒకడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (Moeen Ali) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ (England) జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. వారిలో మొయిన్ అలీ కూడా ఒకడు. దీంతో మొయిన్ అలీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కే ఫుల్‌స్టాప్ (Retirement) పెట్టేశాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మొయిన్ అలీ ఇప్పటివరకు 68 టెస్ట్‌లు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లోలనూ కలిపి 6,600కు పైగా పరుగులు, 360కు పైగా వికెట్లు తీశాడు.
``నాకు ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే చాలా క్రికెట్ ఆడా. ఇక, కొత్త తరం రావాల్సిన అవశ్యకత ఉంది. రిటైర్మెంట్ నిర్ణయంపై నాకేం బాధ లేదు. నేను ఇప్పటికీ క్రికెట్ ఆడగలను. కానీ, ఇంగ్లండ్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా నేను రిటైర్ కావడమే సరైన నిర్ణయమని అనుకుంటున్నా`` అంటూ మెయిన్ అలీ పేర్కొన్నాడు.
మొయిన్ అలీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మొత్తం 67 మ్యాచ్‌ల్లో 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ వంటి పలు క్వాలిటీ ఆల్‌రౌండర్ల కోసం పలు ఫ్రాంఛైజీలు ఎదురు చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..