Share News

Sachin Tendulkar: 37 బంతుల్లోనే షాహిద్ అఫ్రీది ఫాస్టెస్ట్ సెంచరీ.. ఆ రికార్డు వెనుక సచిన్ బ్యాట్ పాత్ర ఏంటంటే..

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:54 PM

పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది బ్యాట్ పట్టుకుని క్రీజులోకి దిగితే ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపిస్తాడు. ఆ క్రమంలో పలు వేగవంతమైన సెంచరీలు కూడా చేశాడు. 1996లో శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.

Sachin Tendulkar: 37 బంతుల్లోనే షాహిద్ అఫ్రీది ఫాస్టెస్ట్ సెంచరీ.. ఆ రికార్డు వెనుక సచిన్ బ్యాట్ పాత్ర ఏంటంటే..
Shahid Afridi

ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది (Shahid Afridi) ఒకడు. అతడు బ్యాట్ పట్టుకుని క్రీజులోకి దిగితే ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపిస్తాడు. ఆ క్రమంలో పలు వేగవంతమైన సెంచరీలు కూడా చేశాడు. 1996లో శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం (37-ball century) సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అఫ్రీది నమోదు చేసిన ఈ రికార్డు దాదాపు 18 ఏళ్ల పాటు నెంబర్ వన్‌గా నిలిచింది. కాగా, షాహిద్ అఫ్రీది సాధించిన ఆ రికార్డు సెంచరీ వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) బ్యాట్‌ది కీలక పాత్ర అట. ఆ ఆసక్తికర విషయాన్ని అఫ్రీది తాజాగా బయటపెట్టాడు.


``శ్రీలంకపై నేను రికార్డు సెంచరీ చేసిన బ్యాట్ నాకెంతో ప్రత్యేకం. నా అభిమాన క్రికెటర్లలో ఒకడైన సచిన్ టెండూల్కర్ బ్యాట్ అది. ఆ బ్యాట్‌తోనే నేను ప్రపంచ రికార్డు నెలకొల్పా. ఈ సందర్భంగా నేను వకార్ యూనిస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఆ బ్యాట్‌ను నాకు వకార్ యూనిస్ ఇచ్చాడు. ఈ బ్యాట్‌తోనే మ్యాచ్ ఆడాలి అని చెప్పాడు. ఆ బ్యాట్ నన్ను క్రికెటర్‌గా తీర్చిదిద్దందని చెప్పాలి. ఆ బ్యాట్‌తో తర్వాత కొన్ని మ్యాచ్‌లే ఆడా. దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుని భద్రంగా దాచేశా`` అంటూ అఫ్రీది చెప్పాడు.


అదే ఏడాది పాక్‌పై జయసూర్య 48 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డును సృష్టించాడు. ఆ రికార్డును అదే ఏడాది అఫ్రీది అధిగమించాడు. అయితే అఫ్రీది రికార్డు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉంది. 2014లో న్యూజిలాండ్ బ్యాటర్ కోరే ఆండర్సన్ 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆ రికార్డును తుడిపేశాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డీవిల్లీర్స్ 31 బంతుల్లోనే శతకానికి చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి..

ఇప్పటికి.. 25


స్వియటెక్‌కు షాక్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 04:54 PM