Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్
ABN , Publish Date - Aug 20 , 2024 | 11:23 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathour) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు (Rohit Sharma Captaincy). రోహిత్ ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోతుంటాడు గానీ, గేమ్ ప్లాన్‌ను మాత్రం మర్చిపోడని చెప్పాడు. తను పని చేసిన వారిలో రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అని విక్రమ్ కితాబిచ్చాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచిందని అన్నాడు.
``రోహిత్ శర్మ ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోతుంటాడు. బస్సుల్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు మర్చిపోతుంటాడు. విదేశాలకు వెళ్లినపుడు పాస్‌పోర్ట్‌లు మర్చిపోతుంటాడు. ఇతరుల పేర్లు మర్చిపోతుంటాడు. కానీ, మైదానంలోకి దిగిన తర్వాత గేమ్‌ప్లాన్‌ను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. రోహిత్ చాలా తెలివైన వ్యూహకర్త. ఆటను బాగా చదవగలడు. వ్యూహాలపై ఓ భారత్ కెప్టెన్ ఇంతలా దృష్టి సారించడం నేనెప్పుడూ చూడలేదు. మ్యాచ్‌కు ముందు బౌలర్లతోనూ, బ్యాటర్లతోనూ చాలా సమయం మాట్లాడుతూ కూర్చుంటాడు. ఆటలో ఎలా ముందుకెళ్లాలనే విషయం గురించి వారి ఆలోచనలను తెలుసుకుంటాడ``ని విక్రమ్ అన్నాడు.
``ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రాను త్వరగా బౌలింగ్‌కు తీసుకురావడం రోహిత్ వేసిన అద్భుతమైన ప్లాన్. బుమ్రా 18వ ఓవర్ వేయడం వల్లే ఆటలో దక్షిణాఫ్రికా వెనక్కి వెళ్లింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. బుమ్రా వచ్చి దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయడంతో వారి లయ దెబ్బతింది. రోహిత్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వాటి అర్థం ఏంటో తర్వాత గానీ అర్థం కాదు`` అంటూ విక్రమ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..