Rohit Sharma: రోహిత్ శర్మ రనౌట్.. ఆ ప్లేయర్‌దే తప్పంటున్న మాజీ ఆటగాడు!
ABN , Publish Date - Jan 12 , 2024 | 08:32 PM
అఫ్గానిస్తాన్‌తో టీ-20 సిరీస్‌ను టీమిండియా సాధికారికంగా ప్రారంభించింది. గురువారం మొహలీలో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ రనౌట్ కావడం సంచలనంగా మారింది.
అఫ్గానిస్తాన్‌తో టీ-20 సిరీస్‌ను టీమిండియా సాధికారికంగా ప్రారంభించింది (Ind vs Afg T20 series). గురువారం మొహలీలో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (Rohit Sharma) రనౌట్ కావడం, అనంతరం గిల్‌ను (Shubman Gill) తిట్టుకుంటూ వెనుదిరగడం సంచలనంగా మారింది. ఈ రనౌట్‌పై పలువురు మాజీ ఆటగాళ్లు స్పందించారు. టీమిండియా మాజీ కీపర్ పార్థీవ్ పటేల్ (Parthiv Patel) కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు (Rohit Sharma Run out).
ఫజల్ హక్ వేసిన రెండో బంతిని రోహిత్ మిడ్ఆఫ్ వైపు ఆడి సింగిల్ కోసం పరుగు ప్రారంభించాడు. అయితే, అవతలి ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ రోహిత్‍ను చూడకుండా బంతినే చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు రోహిత్ పరుగు పూర్తి చేశాడు. ఈ లోపు బంతి అందుకున్న అఫ్గాన్ ఫీల్డర్ రోహిత్‌ను రనౌట్ చేశాడు. దీంతో రోహిత్ పెవిలియన్‍కు వెళుతూ గిల్‍పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ రనౌట్ తతంగంపై భారత మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ మాట్లాడారు.
``రోహిత్ శర్మ సింగిల్‍కు రమ్మనగానే శుభ్‍మన్ గిల్ వెళ్లాల్సింది. రోహిత్‍ను అతడు నమ్మాల్సింది. వారిద్దరూ కలిసి టీ20ల్లో ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి. కానీ, వన్డేలు, టెస్టుల్లో కలిసి ఆడారు కదా. వారి మధ్య మిస్ అండర్‌స్టాడింగ్ వల్లే రనౌట్ జరిగింది. గిల్ స్పందించి ఉంటే కచ్చితంగా ఒక పరుగు వచ్చేది`` అని పార్థీవ్ వ్యాఖ్యానించాడు.