Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?
ABN , Publish Date - Jul 26 , 2024 | 07:23 AM
సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
ఇంటర్నెట్ డెస్క్: సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
ఇవాళ పారిస్ ఒలింపిక్ క్రీడలు(Olympic Games Paris 2024) ప్రారంభం సందర్భంగా డూడుల్ నెట్టింట ఆకట్టుకుంటోంది. 26 జులై నుంచి 11 ఆగస్టు వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభ వేడుకలు..
కరోనా తరువాత నిర్వహిస్తున్న అతిపెద్ద క్రీడాసంరంభం కావడంతో.. చిరకాలం గుర్తుండి పోయే విధంగా గ్రాండ్‌గా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక వేదికల్లో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంతో.. నగరం మొత్తం సందడి వాతావరణం నెలకొంది.
అయితే, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరుపుతున్న మెగా ఈవెంట్ కూడా ఇదేనని భావించాలి. బలమైన శక్తుల మధ్య యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఈవెంట్లు జరగనున్నాయి.
సుమారు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారిగా 1900 సంవత్సరంలో విశ్వక్రీడలను నిర్వహించిన ఈ దేశంలో రెండోసారిగా 1924లో జరిగాయి.
అమెరికా (నాలుగుసార్లు), బ్రిటన్ (మూడుసార్లు) తర్వాత అత్యధికసార్లు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్ రికార్డులకెక్కనుంది. ఓవరాల్‌గా 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని