Share News

Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:17 AM

ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ
Rohit Sharma kissed pandya

ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. చాలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను టీమిండియా 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. గత ఏడాది నవంబర్ 19న అహ్మదాబాద్‌లో నెరవేరని కల ఎట్టకేలకు వెస్టిండీస్‌లో నెరవేరింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. టీ20 వరల్డ్‌కప్‌కు కొన్ని నెలల ముందు పాండ్యా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ బాధ్యతలు స్వీకరించి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.

హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడం కంటే రోహిత్ శర్మను తొలగించడంపైనే ఎక్కువ చర్చ జరిగింది. రోహిత్ 5 సార్లు జట్టు ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మల మధ్య కుదరదని వార్తలు వచ్చాయి. ముంబై ఇండియన్స్(mumbai indians) జట్టు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు చర్చలు జరిగాయి. కానీ తాజా టీ20 ప్రపంచకప్‌‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.


మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలోనే రోహిత్ శర్మ పరుగెత్తుకుంటు వచ్చి హార్దిక్ చెంపపై ముద్దుపెట్టి(kiss) ఆ తర్వాత కౌగిలించుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆ సమయంలో ఎమోషన్(emotional) అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇది చూసిన క్రీడాభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మ్యాచ్ గెలుపు విషయంలో పాండ్యా కీలకపాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సి ఉండగా పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి 7 రన్స్ మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ టోర్నీలో పాండ్యా 144 పరుగులు చేయడంతో పాటు, 11 వికెట్లు తీశాడు. ఇందులో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనే మూడు వికెట్లు ఉన్నాయి.


ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా(Hardik) మాట్లాడుతూ 'నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఈ విజయం కోసం యావత్ దేశం ఎదురుచూసింది. ముఖ్యంగా నా గురించి మాట్లాడితే గత ఆరు నెలలుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎదో ఒక రోజు నాకు మంచి అవకాశం వస్తుందని అనుకున్నాను. కానీ ఈ రకమైన ప్రత్యేకత సంతరించుకున్న అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.


ఇది కూడా చదవండి:

T20 World Cup Winner India : కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

థాంక్యూ.. ద్రవిడ్‌


ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 08:19 AM