Share News

Rohit Sharma: కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యా.. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:00 PM

స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురికావడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారి, 2000లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఒక్కటీ గెలవలేకపోయింది. రెండింట్లోనూ ఓడి వైట్‌వాష్‌కు గురైంది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు.

Rohit Sharma: కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యా.. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ
Rohit Sharma

చెత్త బ్యాటింగ్, నిలకడలేని ఆటతీరుతో ముంబై టెస్టులోనూ (Mumbai Test) ఓటమి పాలైన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయింది (Ind vs Nz Test series). స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురికావడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారి, 2000లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఒక్కటీ గెలవలేకపోయింది. రెండింట్లోనూ ఓడిపోయింది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతకు ముందు 1997లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో సచిన్ కెప్టెన్సీలోనే టీమిండియా 0-3తో వైట్‌వాష్ అయింది. తాజాగా మరోసారి ఆ పరాభవం ఎదురైంది.


ఈ దారుణ వైఫల్యాలపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. తన కెరీర్‌లోనే ఇది అత్యంత హీన దశ అని అభిప్రాయపడ్డాడు. ``ఈ సిరీస్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకోవడం మరింత బాధాకరం. ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలో మాకు తెలియలేదు. కెప్టెన్‌గా, ఆటగాడిగా నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. జట్టును సరైన మార్గంలో నడిపించలేకపోయా. మేం మరింత యాక్టివ్‌గా ఉండాల్సింది. మా బౌలర్లు బాగానే బంతులేశారు. అయితే మేం సమష్టిగా రాణించలేకపోయం`` అని రోహిత్ అన్నాడు.


మరోవైపు టీమిండియాను క్లీన్ స్వీప్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ టామ్ లేథమ్ అన్నాడు. ``చాలా సంతోషంగా ఉంది. భారత జట్టును స్వదేశంలో ఓడించడం అంత సులభం కాదు. మూడు మ్యాచ్‌ల్లోనూ మా ఆటగాళ్లు గొప్పగా ఆడారు. ఆటగాళ్లందరూ వేర్వేరు సమయాల్లో బాధ్యత తీసుకుని ఆడారు. ముంబైలో బౌలింగ్ చేయడాన్ని అజాజ్ పటేల్ ఆస్వాదించాడు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తాం`` అని టామ్ లేథమ్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2024 | 09:00 PM