Jay Shah: బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరు ఉన్నారంటే..?
ABN , Publish Date - Aug 26 , 2024 | 08:46 PM
జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధం అవుతోంది. ఐసీసీ చైర్మన్ పదవికి జై షా పోటీ చేసేందుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మద్దతు ఇస్తున్నాయి. జై షా ఐసీసీలో కీలక పదవి చేపట్టడం దాదాపు ఖాయమే. మరి బీసీసీ కార్యదర్శి పదవి ఎవరిని వరించనుంది. ఇప్పుుడు ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.
రోహన్‌కు అవకాశం..
జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మిగతా వారి కన్నా రోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని దైనిక్ భాస్కర్ హిందీ డైలీ రిపోర్ట్ చేసింది.
గ్రెగ్ నిరాసక్తి
ఐసీసీ నిబంధనల మేరకు 16 మంది ఐసీసీ డైరెక్టర్లు ఆగస్ట్ 27వ తేదీ లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే మరోసారి చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఇప్పటికే రెండుసార్లు ఆయన ఐసీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. గ్రెగ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం జై షాకు కలిసి వస్తోంది. అన్ని కుదిరి ఐసీసీ చైర్మన్ పదవిని జైషా చేపడితే రికార్డ్ సృష్టించినవారు అవుతారు. 36 ఏళ్ల వయస్సులో పదవి చేపట్టి చరిత్ర సృష్టిస్తారు.
ఐదో వ్యక్తి
భారత దేశం నుంచి ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా జై షా నిలుస్తారు. ఆయన కన్నా ముందు జగ్‌మోమన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..