IND vs NZ: సుందర్ స్టన్నింగ్ డెలివరీ.. రచిన్ ఎక్స్‌ప్రెషన్ వైరల్(వీడియో)
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:03 PM
గాల్లో బంతిని గిరవాటు వేసి ప్రత్యర్థిని ఏమార్చి వికెట్ తీసిన సుందర్ బౌలింగ్ స్ట్రైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంతి ఎక్కడి నుంచి వెళ్లిపోయిందో తెలీక రచిన్ రవీంద్ర తలపట్టుకోవాల్సి వచ్చింది.
పూణె: కివీస్ తో టెస్టు సిరీస్ రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమే చేసి చూపారు. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే తమదైన ఆధిక్యం చూపుతూ వస్తున్న భారత జట్టు న్యూజిలాండ్ ను చిత్తు చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. 60వ ఓవర్లో తొలి బంతిని సుందర్ ఆఫ్ స్టంప్ లో వేయడంతో రచిన్ రవీంద్ర ఫ్రంట్ ఫూట్ లో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి అద్భుతంగా లోపలికి బ్యాట్ ను మిస్ చేసి వికెట్లను పడేసింది. సుందర్ డెలివరీని ఊహించలేకపోయిన రవీంద్ర 3 పరుగులు చేయబోయి బిత్తరపోయి ఉండిపోయాడు. బంతి ఎలా మిస్సయ్యిందో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు. అతనిచ్చిన ఎక్స్ప్రెషన్ నెట్టింట వైరలవుతోంది.
నిజానికి న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ భారత్ ప్లేయింగ్-11లో మూడు ముఖ్యమైన మార్పులు చేశాడు. రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తిరిగి వచ్చాడు. వీరితో పాటు ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు కూడా చోటు దక్కింది. చాలా కాలం తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ రెండో సెషన్‌లో తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో వాషింగ్టన్ సుందర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి ఎలాంటి అవకాశం రాలేదు కానీ రంజీలో ప్రదర్శన తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. పూణె టెస్ట్ మ్యాచ్‌లో, వాషింగ్టన్ సుందర్ తన అద్భుతమైన ఆఫ్ స్పిన్ బంతితో రచిన్ రవీంద్రను బౌల్డ్ చేసిచాలా కాలం తర్వాత తన మొదటి వికెట్‌ను అందుకున్నాడు.