India vs Bangladesh: అంటిగ్వాలో వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి?
ABN , Publish Date - Jun 22 , 2024 | 02:05 PM
ప్రస్తుతం అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటికే ఓ విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది.
ప్రస్తుతం అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటికే ఓ విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది (India vs Bangladesh). ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ తర్వాతి దశకు అర్హత సాధిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం (Rain) ముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌తో అంటిగ్వా (Antigua)లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అంటిగ్వా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం అంటిగ్వాలో తేలికపాటి వర్షం పడుతున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం తగ్గే సూచనలున్నాయట. అయితే మ్యాచ్‌కు మాత్రం అంతరాయం కలిగే ప్రమాదం ఉందని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగింది. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.
ఒకవేళ ఈ రోజు జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే భారత్‌కు ఒక పాయింట్ మాత్రమే లభిస్తుంది. ఇప్పటికే అఫ్గాన్‌తో విజయం సాధించిన కారణంగా లభించిన రెండు పాయింట్లతో కలిపి మొత్తం మూడు పాయింట్లతో భారత్ ఉంటుంది. అప్పుడు అస్ట్రేలియా-అఫ్గానిస్తాన్ మ్యాచ్ కీలకం అవుతుంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే ఎలాంటి సమస్యా లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ అఫ్గాన్ గెలిస్తే మాత్రం ఈ నెల 24న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Best Fielder Medal: ఉత్తమ ఫీల్డర్ అతనే.. షాక్‌కి గురైన కోహ్లీ
Virat Kohli: విరాట్ కోహ్లీతో ప్రయోగాలు వద్దు.. ముందుంది మొసళ్ల పండగ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..