Share News

Best Fielder Medal: ఉత్తమ ఫీల్డర్‌ అతనే.. షాక్‌కి గురైన కోహ్లీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:41 PM

అఫ్గాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది.

Best Fielder Medal: ఉత్తమ ఫీల్డర్‌ అతనే.. షాక్‌కి గురైన కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది. అయితే అనూహ్య రీతిలో రవీంద్ర జడేజా దీన్ని దక్కించుకున్నాడు.

మరో ట్విస్ట్ ఏంటంటే.. మెడల్ ఇవ్వడానికి ఓ అతిథిని పిలుస్తారు. ఈ సారి అతిథి లేకుండానే కార్యక్రమం కొనసాగించారు. ఆయన స్థానంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మెడల్‌ని అందించాడు. అనుకోని ఘటనతో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. కోచ్ దిలీప్ మాట్లాడుతూ.. "అఫ్గనిస్తాన్‌తో పోరు రసవత్తరంగా సాగింది. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా కదిలాం.


ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎలాంటి ప్రదర్శన చేశారో.. అదేవిధంగా మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈసారి నలుగురు ప్లేయర్లు గ్రౌండ్‌లో యాక్టివ్‌గా కదిలారు. మిగతావారు మంచి పాత్ర పోషించారు.అర్ష్‌దీప్‌ సింగ్ క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక రెండో ప్లేయర్ రవీంద్ర జడేజా. గ్రౌండ్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. థర్డ్ ప్లేయర్ అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్‌లను అందుకున్నాడు. చాలా రోజుల తరువాత ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన రిషభ్ పంత్‌ మంచి క్యాచ్‌లు అందుకున్నాడు.అందరిలోనూ ఒకరినే ఉత్తమ ఫీల్డర్‌గా ఎంచుకోవాలి. ఈసారి మెడల్ రవీంద్ర జడేజాకు ఇస్తున్నాం.


అతనికి మెడల్ ప్రదానం ఎవరు చేస్తారనేది ఆసక్తి ఉంది కదా"అని దిలీప్ అన్నాడు. ఆ సమయంలో అక్షర్‌ పేరు చెప్పగానే పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడే మెడల్ అందజేస్తారని చెప్పడంతో అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ చేతులమీదుగా అక్షర్ మెడల్ అందుకున్నాడు. ఈ సందర్భంగా కోచ్‌ను జడేజా పైకి ఎత్తుకున్నాడు.

Updated Date - Jun 21 , 2024 | 04:41 PM